రికార్డుపై మహేశ్ ఫ్యాన్స్ గురి.. దిమ్మ తిరిగేలా ఫ్లాన్.. 24 గంటల రచ్చకు స్కెచ్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు... సీనియర్ హీరో కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించి, తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న నటుడు. బాల నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన అతడు... హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను అందుకున్నాడు. ఆ తర్వాతా పలు విజయాలతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఈ మధ్య వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు అభిమానుల కోసం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడని ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం.!

సెటైరికల్ మూవీతో వస్తున్న మహేశ్
పరశురాంతో మహేశ్ బాబు చేస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్‌టైనర్స్‌తో కలిసి మహేశ్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా పలువురు బాలీవుడ్ బ్యూటీల పేర్లు వినిపిస్తున్నాయి. అప్పులు తీసుకుని బ్యాంకులను మోసం చేసే వ్యాపారవేత్తపై సెటైరికల్‌గా ఈ మూవీ రూపొందుతుందని ప్రచారం జరుగుతోంది.
మహేశ్ బాబు సరికొత్త ప్రయోగాలు
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ‘సర్కారు వారి పాట'లో మహేశ్ బాబు సరికొత్తగా కనిపించబోతున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే అతడు గుబురు గెడ్డంతో దర్శనమివ్వబోతున్నాడట. అంతేకాదు, ఈ మూవీ కోసం సిక్స్ ప్యాక్ బాడీ చూపించబోతున్నాడని అంటున్నారు. అలాగే, ఇందులో ట్రిపుల్ రోల్ చేస్తున్నాడని కూడా టాక్ వినిపిస్తోంది.

ఫ్యాన్స్‌కు ప్రిన్స్ ఇంపార్టెంట్ మెసేజ్
ఆగస్టు 9న ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో బయట కూడా కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా తన పుట్టినరోజును భారీ హంగులతో, సమూహంగా ఏర్పడి జరపవద్దు. అభిమానులందరూ ఇంటికే పరిమితం కావాలి అంటూ మహేశ్ బాబు సోషల్ మీడియాలో స్పందించారు.

రికార్డుపై గురిపెట్టిన మహేష్ ఫ్యాన్స్
ఇక మహేష్ బాబు ఆదేశాలకు అనుగుణంగానే ఫ్యాన్స్ స్సందిస్తూ.. ఆగస్టు 8వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 24 గంటలపాటు హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి ట్రెండ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. గతంలో కంటే రికార్డు ట్వీట్లతో సోషల్ మీడియాను రఫ్ ఆడించే విధంగా ఫ్యాన్స్ రచ్చకు కొద్ది గంటల సమయమే ఉంది. ఈ సారిగా ఫ్యాన్స్ గట్టిగానే కొట్టి మరో రికార్డుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











