'ది బిజినెస్ మ్యాన్' ఆడియో ట్రాక్ లు లిస్ట్
పూరీ, మహేష్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ది బిజినెస్ మ్యాన్ ఆడియో డిసెంబర్ 22న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్ స్వరపరచిన ఆరు పాటలు ఉన్నాయి.ఆ ట్రాక్ లిస్ట్..
1. ముంబై ముంబై
2. చందమామ
3. సర్ ..వస్తారో వస్తారా
4. గోవా..గోవా
5. శ్రీరామడు కాదు..
6. బిజినెస్ మ్యాన్ ధీమ్
ఇక ది బిజెనెస్ మ్యాన్ విషయానికి వస్తే...ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం..కొనుగోళ్ళు ..అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది. ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేస్తున్నారు. గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం ముంబై మాఫియాకి చెందిన కథగా తెరకెక్కుతోంది. 'బిజినెస్‌మ్యాన్'గా టైటిల్‌కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఆయన రూపొందించబోయే చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











