»   » మహేష్ ...అక్కడ మల్టి ఫ్లెక్స్ కొంటున్నారా?

మహేష్ ...అక్కడ మల్టి ఫ్లెక్స్ కొంటున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా సురేష్ బాబు,ప్రసాద్స్ కలిసి చేస్తున్న "కాపిటల్ సినిమాస్" వెంచర్ లో రీసెంట్ గా రానా, వెంకటేష్ కలిసి షేర్ తీసుకున్న సంగతి తెలిసిందే. అదే కోవలో ఇప్పుడు మహేష్ బాబు సైతం... గచ్చిబౌళిలోని కొత్తగా నిర్మితమవుతున్న ప్రిస్టన్ మాల్ లోని సింగిల్ స్క్రీన్స్ ని కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫైవ్ స్క్రీన్ మల్టిప్లెక్స్ల్ లో మహేష్ ఒక స్క్రీన్ ని తీసుకుంటున్నాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ ...ప్యారిస్ లో తన ఫ్యామిలీతో హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక మహేష్ చిత్రాల విషయానికి వస్తే.... మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. పి.వి.పి సినిమా పతాకంపై పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. . తమిళ,తెలుగు భాషల్లో ఈ చిత్రం ఒకే సారి ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. మొదటి ఐదు రోజులు ఓ ఫ్యామిలీ సాంగ్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మహేష్‌తో పాటు ఈ షెడ్యూల్‌లో మిగిలిన ప్రధాన తారాగణమంతా పాల్గొన్నారు. సమంత, కాజల్, ప్రణీత.. ఇలా ముగ్గురు హీరోయిన్లతో తెరకెక్కుతోంది.

Mahesh Babu buying multiplex theatres?

దర్శకుడు మాట్లాడుతూ ''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తరవాత మళ్లీ మహేష్‌తో ఓ సినిమా చేయడం ఆనందంగా ఉంది. 'నలుగురు ఉన్న చోట ఓ అందం, ఆనందం ఉంటాయి. అలాంటి అనేకమంది ఒక కుటుంబంలో ఉండి ప్రతి సందర్భాన్ని ఓ ఉత్సవంలా జరుపుకొంటే అదే బ్రహ్మోత్సవం. అలాంటి వాతావరణం మా సినిమాలోనూ కనిపిస్తుంది''అన్నారు.

''మా సంస్థ నుంచి వస్తోన్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రమిది. వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ''అని నిర్మాతలు చెప్పారు.

సత్యరాజ్‌, జయసుధ, రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, కూర్పు: శ్రీకర ప్రసాద్‌, కళ: తోట తరణి

English summary
Mahesh is buying stake in upcoming Preston Mall in Gachibowli.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu