Mahesh Babu: దుబాయ్‌లో ఖరీదైన విల్లా కొనుగోలు.. కోట్లలో మహేశ్ పెట్టుబడులు.. వెకేషన్ పేరుతో ఆ పనులు!

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టిన మహేశ్ బాబు అనతి కాలంలోనే అశేష అభిమానులను సంపాదించుకున్నాడు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ సుధీర్ఘ కాలంగా సత్తా చాటుతున్నాడు. ఇక అందగాడు అనే పదానికి పర్ఫెక్ట్ నిర్వచనంగా అమ్మాయిల్లో మనసుల్లో నిలిచిపోయాడు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ మధ్య ఎక్కువగా వెకేషన్స్ కి వెళ్తున్నాడు. అయితే ఆ వెకేషన్ వెనుక అసలు మ్యాటర్ వేరే ఉందని టాక్ వినిపిస్తోంది.

భారీ హిట్లతో:బాల నటుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఒక్కడు, పోకిరి, దూకుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో సత్తా చాటిన మహేశ్ బాబు ఇటీవలి కాలంలో 'భరత్ అనే నేను' నుంచి వరుసగా 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు', 'సర్కారు వారి పాట' వంటి భారీ హిట్లు తన ఖాతాలో వేసుకుని హవా చాటాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాయి.

Mahesh Babu Buys Luxurious Villa In Dubai And High Investments In Real Estate

ముద్దుగుమ్మలతో:హిట్లు ఫ్లాపులంటూ తేడా చూడకుండా సినిమాలు చేస్తోన్న మహేశ్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అడ్వెంచర్ సినిమాతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్, సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Mahesh Babu Buys Luxurious Villa In Dubai And High Investments In Real Estate

హనుమంతునికి..:SSMB28 సినిమాతో పాటు దర్శక ధీరుడు రాజమౌళితో మరో సినిమా కూడా చేస్తున్నాడు మహేశ్ బాబు. SSMB29 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ బాబు క్యారెక్టర్ కి హనుమంతునికి సమానమైన లక్షణాలు ఉంటాయని పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Mahesh Babu Buys Luxurious Villa In Dubai And High Investments In Real Estate

విదేశాల్లో బిజినెస్:ఇదిలా ఉంటే మహేశ్ బాబు సినిమాలే కాకుడా కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తుంటారు. వీటి ద్వారా వచ్చిన సంపాదనను వ్యాపార రంగంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇప్పటికే ఏఎంబీ సినిమాస్ లో భాగస్వామిగా ఉండటంతో పాటు టెక్స్ టైల్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. నమ్రతా శిరోద్కర్ పేరు మీద ఇటీవల హోటల్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు విదేశాల్లో కూడా బిజినెస్ చేయనున్నాడని టాక్.

Mahesh Babu Buys Luxurious Villa In Dubai And High Investments In Real Estate

చాలా తెలివిగా:మహేశ్ బాబు కోట్లు ఖర్చు పెట్టి దుబాయ్ లో ఖరీదైన విల్లా కొనుగోలు చేశాడని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు కారణంగానే ఆయన దుబాయ్ కు వెకేషన్ గా పేరుతో వెళ్లాడని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అలాగే చాలా తెలివిగా రియల్ ఎస్టేట్స్ లో కూడా పెట్టుబడులు పెడుతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుకే తరచుగా వెకేషన్ పేరుతో విదేశాలకు వెళ్తూ సీక్రెట్ గా పనులు ముగిస్తున్నాడని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X