»   » కాటమరాయుడులో ప్రిన్స్ మహేశ్‌బాబు

కాటమరాయుడులో ప్రిన్స్ మహేశ్‌బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినీ పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రిన్స్ మహేశ్ బాబుల మధ్య రిలేషన్ ఓ ప్రత్యేకమైనది. వారిద్దరూ స్టార్ ఇమేజ్ ను, బేషజాలను పక్కన పెట్టి కలిసి మెలిసి ఉంటారనే టాక్ ఉంది. ఆ వాదనకు బలం కలిగించేలా ప్రిన్స్ మహేశ్ జల్సాలో వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. సరైన సక్సెస్ లేని సమయంలో పవన్ కల్యాణ్ కు జల్సా విజయం జోష్ ను పెంచింది.

 Mahesh Babu cameo role in Pawan Kalyan's Katamarayudu

పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం కాటమరాయుడులో మహేశ్ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారంటూ ఓ వార్త ఇంటర్నెట్ లో షికారు చేస్తున్నది. మహేశ్ పోషించే పాత్ర చిన్నదైనా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, అంతేకాక సినిమా రేంజ్ పెంచే విధంగా ఉంటుందనే న్యూస్ ప్రచారం జరుగుతున్నది. ఈ వార్త రూమరా లేక నిజమా అనే విషయం చిత్ర నిర్మాత గానీ, యూనిట్ గానీ అధికారికంగా వెల్లడిస్తే కానీ నిజం బయటపడదు. ఆ వార్తే నిజమైతే ప్రిన్స్, పవర్ స్టార్ అభిమానులకు పండగే.

English summary
Pawan Kalyan's latest movie is Katamarayudu. There is rumour in telugu film circle that Prince Mahesh Babu potraying a cameo in this movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu