twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రివిక్రమ్ తొందరపాటు.. ఫ్యామిలీ సంతోషాన్ని పక్కన పెట్టిన మహేష్ బాబు!

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర హీరోలు కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా శరవేగంగా సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంటున్నారు ఒకప్పుడు చాలా నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన హీరోలు కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ వలన ఇప్పుడు కాస్త స్పీడ్ పెంచుతున్నారు. గ్యాప్ లేకుండా చకచకా పనులు ముగించుకుని మరొక సినిమాను కూడా మొదలు పెట్టేందుకు సిద్దమవుతున్నారు. ఇక మహేష్ బాబు కూడా మరోసారి స్పీడ్ పెంచుతూ ఉన్నాడు.. అయితే త్రివిక్రమ్ సినిమా కోసం మహేష్ బాబు మొదటి సారి తన ఫ్యామిలీ సంతోషాన్ని కాస్త పక్కన పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఒక సినిమాలో చేయబోతున్న విషయం తెలిసిందే.

    అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ తో మరో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నారు. అసలైతే గత రెండేళ్ళ క్రితం వీరి కలయికలో ఓ సినిమా రావాల్సింది. కానీ కొన్నిసార్లు మహేష్ బాబు బిజీగా ఉండడం వలన త్రివిక్రమ్ ఎదురు చూడలేకపోయాడు. ఇక ఇద్దరికీ సరైన సమయం దొరక్కపోవడంతో మూడవ సినిమా రావడానికి కాస్త సమయం ఎక్కువగానే పడుతోంది. ఈసారి మాత్రం త్రివిక్రమ్ వాయిస్ తోనే తదుపరి సినిమాలు చేయాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు.

    ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా మరొక బాక్సాఫీస్ హిట్ అందుకోవాలనే సూపర్ స్టార్ జెట్ స్పీడ్ లో షూటింగ్ పనులను పూర్తి చేసుకుంటున్నాడు. యువ దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై అంచనాలు అయితే బాగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కూడా సినిమాపై ఒక్కసారిగా అంచనాలను భారీగా పెంచేసింది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని నిర్మాతలు నమ్మకంతో ఉన్నారు.

    Mahesh babu cancelled holiday trip for trivikram project

    ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ చేయబోతున్న సినిమా స్క్రిప్ట్ వర్క్ పనులు అయితే దాదాపు పూర్తయ్యాయి. షూటింగ్ ను వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ ఎప్పటినుంచో ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం సర్కారు వారి పాట షూట్ స్పెయిన్లో జరుగుతోంది. నవంబర్ మొదటి వారంలోగా సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయినట్లే. ఇక ఆ తర్వాత మహేష్ ఫ్యామిలీతో కలిసి సంతషంగా గడపాలని హాలిడే స్పాట్ ను వెతికే పనుల్లో ఉన్నారు.

    అయితే త్రివిక్రమ్ తొందరపాటు వలన మహేష్ బాబు తన హాలిడేస్ కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు. తెలుస్తోంది సాధారణంగా ఎలాంటి సినిమా షూటింగ్ పూర్తయిన కూడా మహేష్ బాబు కుటుంబ సభ్యులతో కొన్ని రోజులపాటు ఎక్కడికైనా వెళ్లి సంతోషంగా గడిపి వస్తూ ఉంటాడు. కానీ ఈ సారి త్రివిక్రమ్ సినిమాను నవంబర్ సెకండ్ వీక్ లోనే మొదలుపెట్టాలని దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకోవడంతో మహేష్ బాబు కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మళ్లీ రాజమౌళి సినిమాను కూడా స్టార్ట్ చేయాలి కాబట్టి ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Mahesh babu cancelled holiday trip for trivikram project
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X