Devara: ఎన్టీఆర్ కోసం రంగంలోకి మహేశ్ బాబు.. ఒకే స్క్రీన్‌లో ఇద్దరు స్టార్ హీరోలు
నందమూరి తారక రామారావు మనవడిగా సినీ రంగ ప్రవేశం చేసినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ స్టార్ హీరోగా సత్తా చాటుతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో తనదైన మార్కును చూపించిన అతడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దీంతో భారీ రేంజ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో హై రేంజ్ యాక్షన్‌తో రాబోతోంది. దీంతో దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు తగినట్లుగానే ఈ మూవీని భారీగానే తీస్తున్నారు. అంతేకాదు, దీన్ని రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు.

హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'దేవర' మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి అస్సలు విరామం లేకుండా వరుసగా షెడ్యూళ్లను జరుపుకుంటూ వచ్చారు. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించి టాకీ పార్టును పూర్తి చేశారు. ఇప్పుడు ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా ఎంతో వేగంగా సాగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతోన్న 'దేవర' మూవీ మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ మూవీ ప్రమోషన్‌ను కూడా ప్రారంభించేశారు. ఇలా ఇప్పటికే ఈ చిత్రం నుంచి మూడు పాటలను విడుదల చేశారు. అలాగే, 10వ తేదీన ట్రైలర్‌ను వదలబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ క్రేజీ న్యూస్ లీక్ అయింది.
'దేవర' మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడడంతో దీని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్టుగా ఎవరు వస్తారన్న దానిపైనా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. దీనికి సూపర్ స్టార్ మహేశ్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్నారట. దీనిపై రెండు మూడు రోజుల్లోనే ప్రకటన రాబోతుందని సమాచారం. గతంలో 'భరత్ అనే నేను' మూవీకి ఎన్టీఆర్ గెస్టుగా వెళ్లిన విషయం తెలిసిందే. మరోసారి వీళ్లిద్దరూ ఒకే చోట కనిపించబోతున్నారనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











