బంధువు కావడంతో మహేష్ బాబు ఒప్పుకున్నాడా?

By Bojja Kumar

Mahesh Babu chief guest for Naveen's film
హైదరాబాద్: సినిమా ఇండిస్టీలో వారసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి మహేష్ బాబు హీరోగా వచ్చి ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో కొనసాగుతున్నారు. కృష్ణ అల్లుడు సుధీప్‌ కూడా ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అదే ఫ్యామిలీకి చెందిన మరో వారసుడు రాబోతున్నాడు. విజయనిర్మల కుమారుడు సీనియర్‌ నరేష్‌ కొడుకైన నవీన్‌ కథానాయకుడిగా కన్పించబోతున్నాడు.

ఈ చిత్రానికి క్రియేటివ్ ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ వద్ద అసోసియేట్‌ ద‌ర్శ‌కుడిగా పని చేసిన రామ్‌ప్ర‌సాద్ ఈ సినిమాకి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నాడ‌ట‌. ఫ్రెండ్లీ మూవీస్ బ్యాన‌ర్‌పై చంటి అడ్డాల ఈ సినిమాని నిర్మించ‌నున్నారు. ఇప్పటికే ఈ చిత్రం గురించి ప్రకటించారు చంటి అడ్డాల. 'నా గత చిత్రం అల్లరి నరేష్ హీరోగా నిర్మించిన 'యముడికి మొగుడు' తరువాత చేయబోయే చిత్రం కన్‌ఫర్మ్ అయ్యింది.

ఇదొక ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతోంది. అన్ని పాటలూ ప్రముఖ కొరియోగ్రాఫర్ వైభవీ మర్చంట్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరించనున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రారంభోత్సవం రేపు(ఆగస్టు 7)న హైదరాబాద్ లో జరుగుతుందని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి మహేష్ బాబును చీఫ్ గెస్టుగా ఆహ్వానించినట్లు సమాచారం. తన బంధువు కావడంతో మహేష్ బాబు వెంటనే ఒకే చెప్పినట్లు ఫిల్మ్ నగర్ టాక్.

ప్రస్తుతం మహేష్ బాబు 'ఆగడు' చిత్రం క్లైమాక్స్ షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ఆగడు చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X