పవన్ కళ్యాణ్ పార్టీ గురించి మహేష్ బాబు కామెంట్?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జన సేన' స్థాపించి రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు తన వంతు ప్రయత్నం మొదలు సంగతి తెలిసిందే. పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ కాస్త ఆవేశంగానే మాట్లాడారు. ఇలాంటి ఆవేశ పరుడు దీర్ఘకాలిక రాజకీయాల్లో కొనసాగడం సాధ్యం అవుతుందా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.....తెలుగు ప్రజల పట్ల ఆయన ఆలోచన తీరును మాత్రం చాలా మంది ప్రశంసిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఆలోచన సూపర్, ఆయన స్పీచ్ అదిరింది అంటూ ఇప్పటికే.......సమంత, మంచు లక్ష్మి, నితిన్, నాని, కోన వెంకట్ లాంటి వారు తమ మద్దతు ప్రకటించారు. తాజాగా పవన్ కళ్యాణ్ కు మద్దతు పలుకుతున్న వారిలో మరో స్టార్ హరో పేరు కూడా వినిపిస్తోంది. ఆయన ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు.

మహేష్ బాబు ఇప్పటి వరకు బహిరంగంగా తన మద్దతు మాత్రం ప్రకటించలేదు. అయితే ఇటీవల ఓ నిర్మాత ఆయన్ను పర్సనల్‌గా కలిసినపుడు పవన్ కళ్యాణ్ పార్టీ ప్రస్తావన వచ్చిందని, 'జన సేన' పార్టీపై ఆయన పాజిటివ్‌గానే స్పందిచారని తెలుస్తోంది. మహేష్ బాబు టీడీపీ అభ్యర్థి అయిన తన బంధువు గల్లా జయదేవ్ మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఇటీవల తన ప్రసంగంలో చంద్రబాబుతో కలిసి పని చేస్తానని చెప్పడాన్ని మహేష్ బాబు స్వాగతించారట.
మొత్తానికి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మద్దతు కారణంగా వచ్చే ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతంలో తెలుగు దేశం పార్టీకి లాభమే జరుగుతుందని అంటున్నారు. రాజకీయాల సంగతి పక్కన పెడితే....పార్టీ ప్రకటన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇక సినిమాలపై ఇంట్రస్టు లేదు, ఉన్న సినిమాలు మాత్రమే చెస్తాను అని చెప్పడం అభిమానులను నిరాశ పరిచింది.


Click it and Unblock the Notifications











