డైరక్టర్ కి మహేష్ బాబు కండిషన్స్

By Srikanya

మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ డిమాండ్ తో డైరక్టర్స్ కి కండిషన్స్ ,రూల్స్ పెడుతున్నట్లు సమాచారం. తాజాగా ఆయన్ని ఎప్రోచ్ అయిన తమిళ దర్శకుడు కె.వి ఆనంద్ ఈ విషయమై చాలా నిరాశగా ఉన్నట్లు తమిళ సర్కిల్స్ లో వినపడుతోంది. రంగం సినిమాతో విజయం సాధించిన ఆనంద్ తన తదుపరి చిత్రం కోసం మహేష్ కి కథ వినిపించారు. అయితే మహేష్ ఆ కథలో మార్పులు చెప్పటమే కాక, తన హీరోయిజం ని ఎలివేట్ చెయ్యమని పురమాయించాడట. అంతేగాక ఆయన రెగ్యులర్ గా తీసే సినిమాల తరహాలో కథే హీరో అంటే కుదరదని, తనకంటూ ఇమేజ్ ఉందని, తన హిట్ చిత్రాలు చూసి ఆ ఎలిమెంట్స్ ని ఎలా హైలెట్ చెయ్యాలో గమనించమన్నాట.

అవన్నీ చూసుకుని, వాటిని స్క్రిప్టులో అమర్చి అప్పుడు కలవమని చెప్పాట్ట.స్క్రిప్టు తనకు అనుగుణంగా నచ్చాక అప్పుడు వాటిని తెలుగులో ఏ రైటర్ చేత డైలాగులు రాయిస్తే బావుంటుందో చూసి పురమాయిద్దామని చెప్పాడట. అన్నీ సెట్ అయిన తర్వాత డేట్స్ గురించి మాట్లాడదామని స్పష్టంగా చెప్పాడని చెప్తున్నారు. అలాగే తనతో సినిమా అంటే ది బిజెనెస్ మ్యాన్, సుకుమార్ సినిమాల తర్వాత చేయాల్సి ఉంటుందని చెప్పాడు. అయితే కెవి ఆనంద్ కథే హీరో అని స్పష్టంగా నమ్మే ఆయన వీటికి ఒప్పుకుంటాడా లేదా అన్నది సమస్య.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X