»   » అవార్డులు అమ్ముడు పోతున్నాయి: మహేష్ బాబు సంచలనం?

అవార్డులు అమ్ముడు పోతున్నాయి: మహేష్ బాబు సంచలనం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మన దేశంలో అవార్డుల విషయంలో అనేక విమర్శలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు సైతం అమ్ముడు పోతున్నాయని గతంలో చాలా సార్లు ఆరోపణలు విన్నాం. ఇక సినిమా అవార్డుల విషయంలోనూ ఇలాంటి ఆరోపణలు కోకొల్లలు.

ఇలాంటి వివాదాస్పద అంశాలపై ప్రముఖులు స్పందిస్తే... మీడియాలో మరింత హైలెట్ అవుతాయి. కాగా.... మహేష్ బాబు ఇటీవల ఇంటర్వ్యూలో అవార్డులపై విమర్శలు చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది.

నంది అవార్డులపై మహేష్ కామెంట్?

నంది అవార్డులపై మహేష్ కామెంట్?

నంది అవార్డుల విషయంలో మహేష్ బాబు వివాదాస్పద కామెంట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఎప్పుడు? ఎక్కడ? ఈ విషయం గురించి మాట్లాడారు అనే విషయంపై మాత్రం సరైన క్లారిటీ లేదు.

మహేష్ బాబును డబ్బు అడిగారా?

మహేష్ బాబును డబ్బు అడిగారా?

ఓసారి నంది అవార్డ్స్ నిర్వాహకులు తనకు ఓ సినిమా విషయంలో బెస్ట్ యాక్టర్ అవార్డ్ కు ఎంపిక చేస్తామన్నారని, అయితే ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడానికి డొనేషన్ అడిగారని మహేష్ బాబు చెప్పినట్లు....వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

తిరస్కరణ

తిరస్కరణ

అయితే డబ్బులు ఇచ్చి అవార్డు కొనుక్కునే స్థితిలో తాను లేనని తాను తిరస్కరించడంతో ఆ అవార్డు మరొక వ్యక్తికి కేటాయించారని మహేష్ బాబు చెప్పినట్లు...... సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన వార్తలోని సారాంశం.

అన్ని అలా అనడం లేదు

అన్ని అలా అనడం లేదు

అన్ని అవార్డులు కొనుక్కుంటే వచ్చినవే అని నేను అనడం లేదు, కొన్ని సందర్భాల్లో ఇలాంటివి జరుగుతాయని నాకు జరిగిన అనుభవంతో తెలుసుకున్నాను అని మహేష్ బాబు చెప్పినట్లు తెలుస్తోంది.

English summary
Social media buzz is that, Super Star Mahesh Babu in a candid interview made startling revelation on buying and selling of awards. He said that organizers of ‘Nandi Awards’ once promised to give him the Best Actor award for a particular film, if he should donate some funds for organising the function.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu