ఎందరు స్టార్ హీరోలున్నా ఆ క్రేజ్ మహేష్ బాబుకే దక్కింది...!?
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన 'పోకిరి" చిత్రంలో రైల్వే స్టేషన్, ట్రైన్లో ఎక్కువ సీన్స్ ఉంటాయి. ఆ సన్నివేశాలను చిత్రీకరించిన రైల్వేస్టేషన్ లో వేరే సినిమాలు షూటింగ్ చేసినప్పుడు 'పోకిరి" రైల్వే స్టేషన్ అని, మహేష్ బాబు రైల్వే స్టేషన్ లో షూటింగ్ చేస్తామని పరిశ్రమ వర్గాలు అంటుంటాయి. అలాగే 'అతడు" సినిమా కోసం వేసిన సెట్ కి కూడా అతడు ఇల్లు అని, మహేష్ బాబు హౌస్ అని సినీ వర్గాలు చెబుతుంటాయ్.
మామూలుగా సినిమాలో మంచి క్యారెక్టర్ చేసినప్పుడు ఆ పాత్ర పేరు ఇంటి పేరుగా మారుతుంటుంది. ఉదాహరణకు జె.డి చక్రవర్తి, 'అల్లరి" నరేష్ లాంటివారిని చెప్పుకోవచ్చు. కానీ లొకేషన్స్ కి హీరో పేరు పెట్టడం అనేది నేటి తరంలో మహేష్ బాబుకే జరిగిందని చెప్పొచ్చు.
మహేష్ బాబు పోకిరి అతడు జేడి చక్రవర్తి అల్లరి నరేష్ పూరి జగన్నాథ్ mahesh babu pokiri athadu jd chakravarthy allari naresh puri jagannath


Click it and Unblock the Notifications