ఆగడు : నిర్మాతకు మహేష్ ఆర్థిక సహాయం

By Srikanya

హైదరాబాద్ : తనతో వరసగా ఆగడు, 1 నేనొక్కడినే చిత్రాలు నిర్మించి పరాజయం పాలైన నిర్మాతలకు మహేష్ చేయిందించి ఫైనాన్సియల్ గా హెల్ప్ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ రెండు చిత్రాలను నిర్మించిన 14 రీల్స్ వారు...మహేష్ కు రెండు చిత్రాలు నిమిత్తం బ్యాలెన్స్ ఎమౌంట్ ఇవ్వాల్సి ఉంది. అయితే మహేష్ తన సినిమాల వల్ల నష్టపోవటంతో బ్యాలెన్స్ ఎమౌంట్ ని పే చేయొద్దని చెప్పారని వినికిడి. గతంలోనూ ఖలేజా సమయంలో మహేష్...తన రెమ్యునేషన్ తగ్గించుకుని సినిమా బయిటపడటానికి సాయం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.

మరో ప్రక్క ఊహించని విధంగా రెండో రోజు నుంచి కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యాయి. ఈ నేపధ్యంలో బాగా నష్టపోతామనుకున్న ఈ చిత్రం ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తమ డబ్బుని వెనక్కి ఇవ్వమని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మొదటి వీకెండ్ లోనే కలెక్షన్స్ పూర్తి స్ధాయిలో డ్రాప్ అవటం ఎవరూ ఊహించలేదు. ఈ భారీ చిత్రాన్ని భారీ మొత్తాలు ఇచ్చి సొంతం చేసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ ...14 రీల్స్ వారిని రికవరీ చేయమని అడుగుతున్నట్లు సమాచారం.

Mahesh Babu Cuts his Fee for Aagadu

గతంలో రజనీకాంత్ వంటి స్టార్ హీరోలు చిత్రాలు కథానాయుకుడు, బాబా వంటివి ఫ్లాప్ అయినప్పుడు అక్కడ డిస్ట్ర్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఇలాగే పట్టుబడితే.. రజనీ స్వయంగా కలగ చేసుకుని సెటిల్ చేసుకున్నట్లు చెప్పుకున్నారు. తమ పేరు చెప్పే బిజినెస్ జరుగుతున్నప్పుడు వారికి రికవరీ చెయ్యాల్సిన భాధ్యత కూడా హీరోలు తీసుకోవాలంటున్నారు. అయితే మహేష్ బాబు ఇందులో ఇన్వాల్స్ అవటానికి ఆసక్తి చూపటానికి ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. ఆయన త్వరలోనే వెకేషన్ కి వెళ్ళబోతున్నట్లు చెప్పుకున్నారు.

ఆగడు చిత్రం కలెక్షన్స్ డ్రాప్ అవుతూండటంతో నిర్మాతలు..మహేష్ ని కలిసి...ప్రమోషన్ కు రమ్మని అడిగినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో మహేష్ బాబు చాలా నిర్మహమాటంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అన్ని చోట్లా పూర్తి నెగిటివ్ టాక్ నడుస్తోందని, ఈ పరిస్ధితిల్లో తాను పూనుకుని ప్రమోట్ చేసినా ఫలితం ఉండదని ఆయన చెప్పినట్లు ఫిలిం సర్కిల్స్ లో వినపడుతోంది.

అదే బ్యానర్ నుంచి వచ్చిన 1 నేనొక్కిడనే, ఆగడు రెండు కూడా ఊహించని విధంగా పరాజయం పొందటంతో మహేష్ బాబు చాలా నిరాసగా ఉన్నారని అంటున్నారు. అందుకే ఆయన తన ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లి వచ్చి తిరిగి తన పనుల్లో బిజీ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. తర్వాత ఆయన కొరటాల శివ తో చిత్రం చేస్తున్నారు. కొరటాల శివ తో చేయబోయే చిత్రం పై బాగా ప్రెషర్ పడనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X