SSMB 29 కోసం మహేశ్ బాబు సాహసం.. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ అలా చేస్తున్న సూపర్ స్టార్
సూపర్ స్టార్ మహేశ్ బాబు చివరిగా గుంటూరు కారం చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఆ సినిమా వరకు బాబు కేవలం రీజినల్ చిత్రాల్లోనే నటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా చిత్రాల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహేశ్ బాబు తొలి పాన్ ఇండియా ఫిల్మ్ ఎప్పుడూ వస్తుందా? అని అభిమానులు, నార్మల్ ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా మహేశ్ బాబు ఏకంగా పాన్ వరల్డ్ చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో అనౌన్స్ చేసి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం SSMB 29 వర్క్ టైటిల్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా విషయంలో బాబు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
భారీ బడ్జెట్ తో SSMB 29..
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో మహేశ్ బాబు - ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో SSMB 29 చిత్రం రూపుదిద్దుకుంటోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో కేఎల్ నారాయణ రూ.1000 కోట్లతో నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేస్తుండటం విశేషం. ఈ సినిమా కోసం భారీ సెట్స్ ను ఏర్పాటు చేయడం కూడా సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

ఆగిపోయిన షూటింగ్..
SSMB 29 షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకమైన సెట్ నిర్మించి కొంత షూటింగ్ ను పూర్తి చేశారు. మరోవైపు కర్ణాటక, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను షూట్ చేశారు. ఇక సౌత్ ఆఫ్రికాలోనూ ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం మూడు షెడ్యూల్లను పూర్తి చేసుకుందని సమాచారం. ఇక నెక్ట్స్ షెడ్యూల్ కోసం కెన్యాకు వెళ్లాల్సి ఉంది. కానీ అక్కడ రాజకీయ పరిస్థితులు బాగా లేకపోవడంతో ఆ షెడ్యూల్ కు సంబంధించిన షూట్ ను ప్రస్తుతం పోస్ట్ పోన్ చేశారని టాక్. ఇక హైదరాబాద్ లోనే మహేశ్ బాబుపై ఓ సోలో సాంగ్ షూట్ జరుగనుందని తెలుస్తోంది.
మహేశ్ బాబు కీలక నిర్ణయం..
ఇప్పటి వరకు మహేశ్ బాబు నటించిన ప్రతి చిత్రం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. అన్ని విషయాల్లో మహేశ్ బాబు మెప్పిస్తూ వస్తున్నారు. ఇక యాక్షన్ సీన్స్ లలో మాత్రం బాబు ఫుల్ స్ట్రెంత్ చూపించలేదు. ఆయా సీన్లలో డూప్ ను వాడుకున్నారు. కానీ SSBM 29 విషయంలో మాత్రం డూప్ వద్దని మహేశ్ బాబు చెప్పారంట. ప్రతి యాక్షన్ సీన్, స్టంట్స్ అన్నీ తానే స్వయంగా చేస్తానని రాజమౌళికి చెప్పారంట. ఇక మహేశ్ బాబు సైడ్ నుంచి ఇది సాహసమనే అంటున్నారు. ఇదే నిజమైతే అవుట్ పుట్ వేరే లెవల్లో ఉంటుందని సినీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
SSMB 29 వివరాలు..
ప్రస్తుతం ఇండియాలోనే SSMB 29 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన జక్కన్న ఎస్ఎస్ఎంబీ29తో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారోనని ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. అమెజాన్ అడవుల్లో సాగే యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ గా రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరికొంత మంది హాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు. ఇక సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











