twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Thalapathy 66: మహేష్ బాబు కూతురు వెండితెర ఎంట్రీ.. కోలీవుడ్ స్టార్ హీరోతో క్యూట్ రోల్

    |

    కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మెల్లగా టాలీవుడ్ మార్కెట్ పై ఫోకస్ పెంచుతున్నాడు. మాస్టర్ సినిమా ముందు వరకు కూడా విజయ్ తెలుగులో అయితే అంతగా ఫోకస్ చేయలేదు. కొన్ని తమిళ సినిమాలు అయితే విజయ్ కు తెలియకుండానే తెలుగులో విడుదల అయ్యాయట. ఇక ఇప్పుడు మాస్టర్ తో వచ్చిన ఫలితం పై కాస్త ఎక్కువగానే టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార కూడా నటించబోతుందన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వార్తలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. ఇక పాత్ర కూడా చాలా లవ్లీగా క్యూట్ గా ఉంటుందని ఒక టాక్ అయితే వస్తోంది. వివరాల్లోకి వెళితే..

     ఆ సినిమా నుంచి స్పెషల్ ఫోకస్

    ఆ సినిమా నుంచి స్పెషల్ ఫోకస్

    నిజానికి విజయ్ సర్కార్ సినిమా కంటే ముందు వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ పైన అయితే పెద్దగా ఫోకస్ చేయలేకపోయాడు. కొన్నేళ్ల క్రితం బాగానే ప్రయత్నాలు చేసినప్పటికీ తెలుగులో అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఇక ఆ తర్వాత మళ్లీ అటు వైపు చూడలేదు. ఏప్పుడైతే తుపాకి సినిమా తెలుగులో హిట్ అయిందో ఆ తర్వాత మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల చేయడానికి ప్రత్యేకంగా నిర్మాతలతో చర్చలు జరిపాడు.

    దిల్ రాజు నిర్మాణంలో..

    దిల్ రాజు నిర్మాణంలో..

    మెర్షల్ తో పాటు సర్కార్ ఆర్ సినిమా లకు తెలుగులో అయితే మంచి స్పందన వచ్చింది. ఇక తర్వాత మాస్టర్ సినిమా కూడా తెలుగులో భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. ఇటీవల కాలంలో ఏ తమిళ హీరో కూడా తెలుగులో ఆ స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ కి ఒక మార్గమైతే సెట్ అయినట్లు అర్థమవుతోంది. అందుకే ఒక ద్విభాషా చిత్రాలు చేయాలనే ప్లాన్ వేశాడు. ఇక అతడు అనుకోకుండా దిల్ రాజుతో మంచి ప్రాజెక్ట్ సెట్ అయినట్లు తెలుస్తోంది.

    విజయ్ తో మహేష్ బాబు కూతురు

    విజయ్ తో మహేష్ బాబు కూతురు

    మహర్షి సినిమా తర్వాత దర్శకుడు వంశీ పైడిపల్లి ఎవరితో సినిమా చేయాలని అనుకుంటున్న సమయంలో దిల్ రాజు విజయ్ 66 సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడు. ఇటీవల ప్రాజెక్టు పై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక పాత్రలో మహేష్ బాబు కూతురు సితార కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు సెట్ అయితే కనుక ఆమెకు ఇదే మొదటి సినిమా అని చెప్పవచ్చు.

    Recommended Video

    Mahesh Babu Namrata Shirodkar - Best Couple In Tollywood
    క్యూట్ గా స్పెషల్ రోల్

    క్యూట్ గా స్పెషల్ రోల్

    ఇప్పటికే మహేష్ బాబు కొడుకు గౌతమ్ వన్ నేనొక్కడినే సినిమా ద్వారా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు సితార కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 66 ప్రాజెక్టులో కూతురు గా కనిపించే అవకాశం ఉందట. సితార పాత్ర ఈ సినిమాలో చాలా క్యూట్ గా ఉంటుందని తెలుస్తోంది. మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిన విషయమే. అలాగే వీరి కూతుళ్లు కూడా స్నేహితులు కావడంతో వంశీపైడిపల్లి చాలాసార్లు సితారలోని టాలెంట్ ను గుర్తించాడు. ఇప్పుడు దర్శకుడు విజయ్ కూతురి పాత్రలో చూపించేందుకు మహేష్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

    English summary
    Mahesh babu daughter Sitara to act in thalapathy 66 as vijay daughter,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X