SSMB28: మహేశ్ బాబుకు ఆరోగ్య సమస్య.. సూపర్ స్టార్ సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్‌కు బిగ్ రిలీఫ్ ఏంటంటే!
గతంలో కంటే ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్నాడు హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ ఉత్సాహంతోనే అతడు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తోన్నాడు. ఇలా ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్నాడు. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టైటిల్ గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతోన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దీని నుంచి మరో న్యూస్ లీకైంది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!
గురూజీతో మహేశ్ మరోసారి:మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా ఓ సినిమాను చేస్తోన్నాడు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది కీలక పాత్రలు చేస్తున్నారు.

బ్రేకులతోనే.. షూటింగ్ ఇలా:'అతడు', 'ఖలేజా' వంటి కల్ట్ క్లాసిక్ మూవీల తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది. ఆ వెంటనే మొదటి షెడ్యూల్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేశారు. తర్వాత కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా దాని తర్వాత నుంచి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు.
అప్పటికి వాయిదా వేశారుగా:సక్సెస్‌ఫుల్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, షూటింగ్ సజావుగా సాగని కారణంగా దీన్ని వాయిదా వేస్తున్నారని ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా తీసుకు వస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ఓ కొత్త పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చేసింది.

టైటిళ్ల విషయంలో డైలమా:ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం 'అర్జునుడు', 'అతడే పార్థు', 'అమ్మ కోసం', 'అయోధ్యలో అర్జునుడు', 'అమ్మకోసం', 'గుంటూరు కారం', 'అమరావతికి అటు ఇటు' వంటి టైటిళ్లను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ, దీనిపై మాత్రం డైలమా కొనసాగుతూనే ఉంది.
మహేశ్‌కు ఆరోగ్య సమస్య:సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తోన్న ఈ ప్రతిష్టాత్మక సినిమా నుంచి తరచూ ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంది. దీంతో దీనికి సంబంధించిన మేజర్ హైలైట్లు ఒక్కొక్కటిగా రివీల్ అవుతోన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రంలో మహేశ్ బాబుకు ఓ ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్య ఉంటుందని తెలిసింది.

సినిమాలో అదే బిగ్ ట్విస్ట్:ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మహేశ్ బాబు ఓ ప్రాణాంతకమైన వ్యాధితో బాధ పడుతుంటాడట. దాన్ని ఇంటర్వెల్‌కు ముందే రివీల్ చేస్తారని తెలిసింది. ఆ సమయంలో వచ్చే ట్విస్ట్ సినిమా రూపురేఖలనే మార్చేలా ఉంటుందని అంటున్నారు. ఇక, సెకెండాఫ్‌లో ఆ వ్యాధి తాలూకు వివరాలను బయటపెడతారనే టాక్ వినిపిస్తోంది.
ఫ్యాన్స్‌కు బిగ్ రిలీఫ్‌తోనే:క్రేజీ కాంబోలో రూపొందుతోన్న ఈ చిత్రంలో మహేశ్ బాబుకు ప్రాణాంతకమైన వ్యాధి ఉన్నప్పటికీ.. ఇందులో విచారకర ముగింపు (శాడ్ ఎండింగ్) మాత్రం ఉండదని తెలిసింది. అంటే శుభం కార్డు పడే సమయానికి అతడు కోలుకోవడమో.. మరొకటో ఉంటుందని తెలిసింది. ఇక, మొత్తంగా ఈ సినిమాలో మహేశ్‌కు డిసీజ్ ఉందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











