twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవిని డిస్ట్రబ్ చేస్తున్న మహేష్ బాబు

    By Srikanya
    |

    మహేష్ బాబు తాజా చిత్రం దూకుడు రికార్డులు చిరంజీవిని చాలా డిస్ట్రబ్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ప్రత్యేకంగా రోజూ ఈ కలెక్షన్స్ ని డిస్ట్రిబ్యూటర్స్ నుంచి,తన సన్నిహితులనుంచి అడిగితెలుసుకుంటున్నారని తెలుస్తోంది. దానికి కారణం తన కుమారుడు రామ్ చరణ్ మగధీర కలెక్షన్స్ ని అది నిజంగా బ్రేక్ చేస్తోందా లేదా అని తెలుసుకోవటానకి అని చెప్తున్నారు. అంతేగాక రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ కూడా ఇప్పుడు దూకుడు రికార్డులు బ్రద్దలు కొట్టేలా ఉండాలని దర్శకుడు సంపత్ నందికి ఆదేశించినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తాను చాలా కాన్పిడెంట్ గా ఉన్నట్లు తన తండ్రితో చెప్పినట్లు తెలుస్తోంది.అందులోనూ దూకుడు చిత్రం అమెరికాలో పేరుపొందిన పత్రికల్లో ఒకటైన లాస్ ఏంజిల్స్ టైమ్స్ - 'దూకుడు', ద బిగ్గెస్ట్ హిట్ యు హావ్ నెవర్ హార్డ్ ఆఫ్ - అంటూ ఓ వ్యాసాన్నే ప్రచురించడం కూడా చిరుని టెన్సన్ లో పడేసింది.

    ఆ పత్రిక ప్రస్తుతం హాలీవుడ్ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సాధిస్తున్న 'మనీబాల్', 'అబ్డక్షన్స్', 'డాల్ఫిన్స్ టేల్స్'కు దీటుగా టాలీవుడ్‌కి చెందిన 'దూకుడు' సినిమా కలెక్షన్లను సాధిస్తుండటం అమితాశ్చర్యాన్ని కలిగిస్తున్నదని పేర్కొంది. ఇదివరకు అమెరికాలో ఓ తెలుగు సినిమా మూడు నెలల్లో 1.2 మిలియన్ డాలర్లు వసూలు చేయడం రికార్డు కాగా, ఇప్పుడు 'దూకుడు' చిత్రం కేవలం తొలి మూడు రోజుల్లోనే 1.4 మిలియన్ డాలర్లు వసూలు చేయడం అనూహ్యమని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. ఇక పెద్ద హిట్ కోసం అంతా ఎదురు చూస్తున్న తరుణంలో వచ్చిన 'దూకుడు' చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయం పరిశ్రమకి ఉత్సాహాన్ని ఇచ్చింది. సినిమాలో మహేష్ చాలా స్టైలిష్‌గా కనిపించి, సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి తన పొటెన్షియాలిటీని రుజువు చేసుకున్నాడు. ఈ యాక్షన్ సినిమాలో వినోదాన్ని అద్భుతంగా మిళితం చేసి శ్రీను వైట్ల అద్భుతంగా తీశాడని పరిశ్రమలోని పెద్దలు సైతం ఈ చిత్రాన్ని మెచ్చుకుంటున్నారు.ఇది రామ్ చరణ్ మీద టెన్షన్ పెంచే అంశమే.

    English summary
    Chiru is under the fear if 'Dookudu' movie will get past the records set by his son Ram Charan through the film 'Magadheera'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X