తన కెరీర్‌లోనే తొలిసారి సరికొత్త ప్రయోగం చేస్తున్న మహేశ్.. ఫ్యాన్స్ ట్రోల్ చేయడమే కారణం

By Manoj

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పీడు పెంచేశాడు. 'భరత్ అనే నేను', 'మహర్షి' వంటి సూపర్ హిట్ చిత్రాలు ఇచ్చిన ఉత్సాహంతో ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది షూటింగ్ జరుపుకుంటుండగానే మహేశ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇందులో అతడు తొలిసారి ఓ ప్రయోగం చేయబోతున్నాడట. పూర్తి వివరాల్లోకి వెళితే..

 దీంతో హ్యాట్రిక్ చేసేస్తాడా..?

దీంతో హ్యాట్రిక్ చేసేస్తాడా..?

మహేశ్ బాబు వరుసగా ‘భరత్ అనే నేను', ‘మహర్షి' అనే సినిమాలో విజయాలు సాధించాడు. వీటి తర్వాత ఆయన.. అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. దీనిని అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇది కూడా హిట్ అయితే మహేశ్ హ్యాట్రిక్ చేసినట్లు అవుతుంది.

మహేశ్ ఇలా ఎప్పుడూ చేయలేదు

మహేశ్ ఇలా ఎప్పుడూ చేయలేదు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తన తర్వాతి సినిమాను వంశీ పైడిపల్లితో చేయబోతున్నాడని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ ఆయన ఇంత త్వరగా ఒకే డైరెక్టర్‌తో రెండు సినిమాలు చేయలేదు. ఇప్పుడు ఇది ఫిక్స్ అయితే సరికొత్త పద్దతికి శ్రీకారం చుట్టినట్లు అవుతుంది.

సరికొత్త ప్రయోగం చేస్తున్న మహేశ్

సరికొత్త ప్రయోగం చేస్తున్న మహేశ్

ఇదే సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఈ సినిమాలో మహేశ్ బాబు గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తాడట. గతంలో ఎన్నడూ ఆయన ఈ తరహా పాత్రలు చేయలేదు. దీంతో ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి మహేశ్ అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.

 ఆ రెండు క్యారెక్టర్లను మించి

ఆ రెండు క్యారెక్టర్లను మించి

గతంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘పోకిరి', ‘బిజినెస్‌మ్యాన్' సినిమాల్లో మాఫియా నేపథ్యం ఉన్న యువకుడిలా కనిపించాడు. ఆ రెండు సినిమాలు కూడా భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు వంశీ పైడిపల్లి సిద్ధం చేసిన కథలో హీరో పాత్ర వాటికి మించి ఉంటుందని సమాచారం. దీంతో ఈ పాత్రపై ఊహాగానాలు మొదలైపోయాయి.

Recommended Video

#CineBox : RGV's #KRKR In Trouble? | Pawan Kalyan Voice Over For #AlaVaikunthapuramuloTeaser ?
 ఆ డైరెక్టర్‌ను ట్రోల్ చేసిన ఫ్యాన్స్

ఆ డైరెక్టర్‌ను ట్రోల్ చేసిన ఫ్యాన్స్

వాస్తవానికి వంశీ పైడిపల్లితో మహేశ్ సినిమా ఉంటుందని కొద్ది రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. ఆ సమయంలో సోషల్ మీడియా వేదికగా మహేశ్ ఫ్యాన్స్ వంశీని ట్రోల్ చేశారు. తమ అభిమాన హీరోతో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం ఆపేసి, పక్కా కమర్షియల్ సినిమా తీయాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ కారణంగానే వంశీ గ్యాంగ్‌స్టర్ స్టోరీని సిద్ధం చేశాడని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X