ఏదో తేడాగా ఉందేంటి.. మహేష్ బాబు ఫ్యాన్స్ లో మహానటి టెన్షన్?
సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో దాదాపు జీవితానికి సరిపోయేంత క్రేజ్ ను సంపాదించుకున్న నటి మణుల్లో కీర్తి సురేష్ ఒకరు. మహానటి సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ తన నటనతో ఏ స్థాయిలో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా తర్వాత కీర్తి సురేష్ చేస్తున్న సినిమాలు అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోతున్నాయి. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ గా మారుతున్నాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఈ విషయంలో కొంత అప్సెట్ అవుతున్నారు అనే చెప్పాలి.

అగ్ర హీరోలతో సినిమాలు
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకుంటున్న హీరోయిన్స్ లలో కీర్తి సురేష్ ఒకరు. రామ్ పోతినేని నేను శైలజ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ తర్వాత చాలా తొందరగానే అగ్ర హీరోలతో సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన మహానటి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

గ్యాప్ లేకుండా ఆఫర్స్
అలనాటి అందాలతార సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాలో కీర్తి సురేష్ నటించిన విధానం అందరినీ ఎంతగానో ఎమోషనల్ అయ్యేలా చేసింది. ఒక్క సినిమాతోనే కీర్తి సురేష్ కి భారీ స్థాయిలో గుర్తింపు దక్కింది. బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ అందకపోవడంతో ఆ తర్వాత మహానటికి గ్యాప్ లేకుండా ఆఫర్స్ అయితే వచ్చాయి.

ఎలాంటి సినిమా చేసినా..
ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా రావడంతో కీర్తి సురేష్ అందులో తనకు నచ్చిన సినిమాలు సెలెక్ట్ చేసుకుంది. కానీ ఆ సినిమాలు ఏవి కూడా ఈ బ్యూటీకి అనుకున్నంత స్థాయిలో విజయాన్ని ఇవ్వడం లేదు. పందెంకోడి 2 సినిమా నుంచి చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలను అందుకుంటున్నాయి. ఆ మధ్య మన్మధుడు 2 సినిమాలో కూడా ప్రత్యేకమైన పాత్రలో నటించింది గాని ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.

రంగ్ దే సినిమా కూడా
2020లో వచ్చిన పెంగ్విన్ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ముందు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయినప్పటికీ కూడా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేదు. ఆ తరువాత వచ్చిన మిస్ ఇండియా సినిమా కూడా అదే తరహాలో డిజాస్టర్ అయ్యింది. ఇక నితిన్ తో చేసిన రంగ్ దే సినిమా కూడా ఏమాత్రం సంతృప్తిని ఇవ్వలేక పోయింది.

గుడ్ లక్ సఖి..
రీసెంట్ గా వచ్చిన గుడ్ లక్ సఖి సినిమా కూడా మొదటి షోతోనే దారుణమైన నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అసలే కరోనా పరిస్థితిలో జనాలు సినిమా థియేటర్ లోకి రావడం లేదు. ఈ తరుణంలో కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి భారీగానే విడుదల చేశారు. కానీ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో దారుణమైన నష్టాలను చూడాల్సి వస్తోంది.
Recommended Video

ఏదో తేడాగా ఉందేంటి..
ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే కీర్తి సురేష్ కు సంబంధించిన అనేక రకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఏదో తేడాగా ఉందేంటి.. అంటూ మహేష్ బాబు అభిమానులు అనుకుంటున్నారు. సినిమాను ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి మహేష్ బాబు ద్వారా ఆయన కీర్తి సురేష్ మళ్లీ ఫామ్ లోకి వస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం కీర్తి సురేష్ సర్కారు వారి పాట సినిమాతో పాటు తమిళంలో ఒక సినిమా మలయాళంలో మరో సినిమా చేస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ సినిమాలో చెల్లెలి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











