రాజమౌళిపై మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం.. ఆ విషయంలో అప్సెట్

సూపర్ స్టార్ మహేశ్ బాబు చివరిగా గుంటూరు కారం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాస్ లుక్ తో అదరగొట్టారు. ఇక నెక్ట్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలిసారిగా రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్ లో SSMB 29 చిత్రం రూపుదిద్దుకుంటుండటంతో భారీ అంచనాలు నెలకున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. అయితే ఎస్ఎస్ఎంబీ 29 విషయంలో మహేశ్ బాబు ఫ్యాన్స్ కాస్తా అప్సెట్ అయినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

6 నెలలుగా షూటింగ్..
ఎస్ఎస్ఎంబీ 29 చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకుందని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ కోసం ఏకంగా భారీ సెట్ ను నిర్మించారు. అల్యూమిలియం ఫ్యాక్టరీలో ఈ చిత్రానికి సంబంధించిన షూట్ జరుగుతోంది. మరోవైపు ఒడిశా, కర్ణాటక, సౌత్ ఆఫ్రియా వంటి ఫారేన్ షెడ్యూల్స్ కూడా పూర్తి చేశారు. నెక్ట్స్ కెన్యాలో జరగాల్సి ఉంది. కానీ అక్కడి పొలిటికల్ వివాదాలతో వాయిదా పడింది.

Mahesh Babu Fans Waiting for SSMB 29 Movie Special Glimpse on Superstar Birthday

హైదరాబాద్ లో ల్యాండ్ అయిన బాబు..
SSMB 29 షూటింగ్ కు కాస్తా గ్యాప్ రావడంతో మహేశ్ బాబు ఫారేన్ ట్రిప్ కు వెళ్లారు. కొద్దిరోజులు ఫ్యామిలీతో కలిసి టూర్ కు వెళ్లడం విశేషం. ఇక తాజాగా బాబు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. దీంతో మళ్లీ నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. నెక్ట్స్ టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందనేది విశేషం.

ఫ్యాన్స్ అప్సెట్ అయ్యింది ఇందుకేనా..
మహేశ్ బాబు అభిమానులు ఎస్ఎస్ఎంబీ 29 చిత్రంపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తుండటం సాధారణంగానే సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. అందుకు తోడు మహేశ్ బాబుతో హాలీవుడ్ తరహాలో అడ్వెంచర్ యాక్షన్ ఫిల్మ్ ను రూపొందిస్తుండటం విశేషంగా మారింది. అయితే ఈ చిత్రం నుంచి మహేశ్ బాబు 50వ పుట్టిన రోజు ఆగస్టు 9న స్పెషల్ గ్లింప్స్ లేదంటే ఏదైనా అప్డేట్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఎస్ఎస్ రాజమౌళి ఎలాంటి అప్డేట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ విషయంలో మహేశ్ బాబు కాస్తా అప్సెట్ అయ్యారని తెలుస్తోంది.

భారీ బడ్జెట్ తో SSMB 29..
టాలీవుడ్ లో తొలిసారి భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న చిత్రం SSMB 29. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. భారీ తారాగణం, హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేస్తుండటంతో 1000 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం.

More from Filmibeat

Read more about: mahesh babu ssmb 29 ss rajamouli
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X