సర్కార్‌పై మహేష్ బాబు సెటైర్లు.. బ్యాంకులను కొల్లగొట్టే బడాబాబులపై ఉక్కుపాదం

By Manoj

చాలా ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలోని టాప్ హీరోల్లో ఒకడిగా వెలుగొందుతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. హ్యాండ్సమ్ లుక్‌తో పాటు అద్భుతమైన యాక్టింగ్‌ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అతడు.. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. పక్కా ప్రొపెషనల్‌గా ఉండే మహేశ్.. పర్సనల్ లైఫ్‌లోనూ వివాదరహితుడిగా పేరొందాడు. ఈ నేపథ్యంలో తాజాగా అతడు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యాడు. ఓ హీరోను ఆదర్శంగా తీసుకునే కఠిన నిర్ణయం తీసుకున్నాడట. ఆ వివరాలు మీకోసం.!

 హ్యాట్రిక్‌తో సరిలేరు అనిపించుకున్న మహేశ్

హ్యాట్రిక్‌తో సరిలేరు అనిపించుకున్న మహేశ్

ఈ మధ్య కాలంలో మహేశ్ బాబు సూపర్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. దీనికి కారణం అతడు వరుసగా విజయాలు సాధించడమే. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘భరత్ అనే నేను', వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ‘మహర్షి'తో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొంది ఇటీవల విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు' సూపర్ హిట్ అవడంతో.. అతడి కెరీర్‌లో విజయాల హ్యాట్రిక్ నమోదైంది.

 అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి.. కొత్త కాంబో సెట్

అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి.. కొత్త కాంబో సెట్

‘సరిలేరు నీకెవ్వరు' హిట్ ఇచ్చిన జోష్‌లో ఉన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఈ ఉత్సాహంతోనే వంశీ పైడిపల్లితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే, అనివార్య కారణాలతో ఈ మూవీ ప్రకటనకు ముందే ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాంతో సినిమా చేయడానికి మహేశ్ పచ్చజెండా ఊపేశాడు.

 సర్కారు వారి పాట... ఎన్నో రికార్డులు బద్దలు

సర్కారు వారి పాట... ఎన్నో రికార్డులు బద్దలు

మహేశ్ బాబు చాలా కాలం తర్వాత ప్యూర్ లవ్‌ స్టోరీ చేస్తున్నాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పరశురాంతో రూపొందించే సినిమాకు ‘సర్కారు వారి పాట' అనే టైటిల్ ఫిక్స్ చేసి షాకిచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విశేష స్పందన వచ్చింది. అలాగే ట్విట్టర్‌లో ఈ మూవీ హ్యాష్ ట్యాగ్ రికార్డులు బద్దలు కొట్టేసింది.

 మహేశ్ బాబు ట్రిపుల్ రోల్... కెరీర్‌లో తొలిసారి

మహేశ్ బాబు ట్రిపుల్ రోల్... కెరీర్‌లో తొలిసారి

సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో హీరోగా మహేశ్ బాబు డబుల్‌ రోల్ సినిమాలు చేయలేదు. అలాంటిది ‘సర్కారు వారి పాట'లో మాత్రం అతడు ట్రిపుల్ రోల్ చేస్తున్నాడని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ మూడు పాత్రలూ చాలా డిఫరెంట్‌గా ఉంటాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా మూడు ఏజ్ గ్రూపులకు సంబంధించిన రోల్స్ అని వార్తలు వస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వంపై మహేశ్ బాబు పోరాటం

కేంద్ర ప్రభుత్వంపై మహేశ్ బాబు పోరాటం

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో పారిశ్రామికవేత్తలు బ్యాంకులను మోసం చేస్తున్న తీరును చూపించబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ గురించి ఓ న్యూస్ లీకైంది. దీని ప్రకారం... ఈ మూవీ సందేశాత్మకంగా ఉంటుందట. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వంపై ఇందులో మహేశ్ సెటైర్లు వేయబోతున్నాడని అంటున్నారు.

Recommended Video

Rana Daggubati-Miheeka Bajaj’s Wedding Not Postponed
ఆ హీరోలా సాహసం చేస్తున్న సూపర్ స్టార్.!

ఆ హీరోలా సాహసం చేస్తున్న సూపర్ స్టార్.!

తమిళంలోని స్టార్ హీరోలలో ఒకడైన ఇళయదళపతి విజయ్.. ఎన్నో సందేశాత్మక చిత్రాల్లో నటించాడు. ఈ క్రమంలోనే ఇటీవల అతడు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ సినిమాలు చేశాడు. ఇప్పుడదే దారిలో మహేశ్ నడుస్తున్నాడని తెలుస్తోంది. ‘సర్కారు వారి పాట'లో ప్రభుత్వంపై సెటైర్లు వేయబోతున్నాడట ఈ సూపర్ స్టార్. దీంతో సినిమాపై ఆసక్తి పెరిగిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X