మహేష్ బాబు 'అతిధి' రిలీజయి చాలా కాలం అవుతున్నా ఏ సినిమా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం హాలిడే ట్రిప్పులో ఉన్న ఈ హీరో వచ్చాక త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తాడని తెలుస్తోంది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'అతడు' మెగా హిట్ కావటంతో అప్పుడే అంచనాలు ప్రారంభమవుతున్నాయి. శింగనమల రమేష్ నిర్మించే ఈ చిత్రం పూర్తి స్క్రిప్టు తో సెట్స్ మీదకు వెళ్ళటానికి రెడీ గా ఉందిట. అలాగే 'వరుడు' అనే టైటిలు చాలా కాలం నుంచీ నలుగుతోంది. హీరోయిన్ ఎవరు అన్నది సస్పన్స్ లో ఉంచి రివిల్ చేసే యోచనలో ఉన్నారట. 24నుంచి ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్ళేందుకు గ్రాండియర్ గా ప్లాన్ చేస్తున్నారుట.