twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ న్యూస్ : థ్రిల్లర్ చిత్రం చేస్తున్న మహేష్ బాబు

    By Srikanya
    |

    హైదరాబాద్ : మహేష్,సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఎలా ఉంటుంది..ఎలా ఉండబోతోంది అనే అంచనాలు అభిమానల్లో రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో మహేష్ ఇప్పటిదాకా చేయని జానర్ తో ఈ చిత్రం చేస్తున్నాడని సమాచారం. అదీ థ్రిల్లర్ జనర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలుస్తోంది. పూర్తిగా స్క్రీన్ ప్లే తో నడిచే చిత్రంగా ఉంటుందని,చాలా ప్రెష్ గా ఉంటుందని,ఖచ్చితంగా తెలుగు తెరపై ఓ కొత్త సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుందని యూనిట్ వర్గాలు చెప్పుకుంటున్నారు.

    దానికితోడు ఈ భారీ బడ్జెట్ చిత్రం టెక్నికల్ గా చాలా అడ్వాన్సెడ్ గా ఉండనుంది. ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం నలభై రోజుల పాటు లండన్ వెళ్లనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ సంవత్సరం మధ్యలో విడుదల కానుంది. అక్కడ పలు కీలక సీన్లు చిత్రీకరించనున్నారు. త్వరలో ఈ షూటింగ్ షెడ్యూల్ డేట్స్ ఖరారు కానున్నాయి.

    ఈ చిత్రంలో క్రితి సానన్ హారోయిన్ గా చేస్తోంది. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా అందిన ఆసక్తికర సమాచారం ఏమిటంటే....బాలీవుడ్ మూవీ 'ఏక్ థా టైగర్'కు అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కాన్రాడ్ పాల్మిశానో 'మహేష్ బాబు-సుకుమార్' సినిమాకు పని చేయబోతున్నారు.

    సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్‌ బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం కోసం మహేష్ బాబు కొత్త లుక్ తో చూపెట్టనున్నారు. ఈ చిత్రంలో షాయాజీ షిండే, కిల్లి దోర్జీ, విక్రమ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక వివరాల్లోకి వెళితే... ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ -స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.

    English summary
    Mahesh Babu’s film with director Sukumar is going to be a thriller filled with edge of the seat moments. The plot and the screenplay will be very fresh and innovative for Telugu Cinema. The production team will be heading to London very soon for a 40 day shoot. Kriti Sanon is the heroine in this movie and Devi Sri Prasad is the music director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X