సిద్దార్ధ దర్శకుడుతో మహేష్ చిత్రం ఖరారు
మహేష్ బాబు వరసగా సినిమాలు కమిటవుతున్న సంగతి తెలిసిందే. ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు చేయాలనే ప్లాన్ లో ఉన్న మహేష్ తాజాగా ఓ చిత్రం కమిటైనట్లు సమాచారం. సిద్దార్దతో బొమ్మరిల్లు చిత్రం డైరక్ట్ చేసిన భాస్కర్ తో ఈ చిత్రం ఓకే అయినట్లు తెలుస్తోంది. నిర్మాత శాఖమూరి మల్లిఖార్జున రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రీసెంట్ గా భాస్కర్ ..సీతమ్మ వాకిట్లో సెట్లో మహేష్ ని కలిసి కథ వినిపించి ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం నవంబర్ 2012 నుంచి ప్రారంభం కానుంది.
ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. అలాగే బొమ్మరిల్లు భాస్కర్...రామ్ హీరోగా ఒంగోలు గిత్త అనే టైటిల్ తో చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ గుంటూరులో జరుగుతోంది. ఇక దూకుడు,బిజినెస్ మ్యాన్ చిత్రాలతో మహేష్ బాబు స్టామినా ఏంటో భాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు పూర్తిగా అర్దమైపోయింది. దాంతో అతనిపై కోట్లు కుమ్మరించటానికి రెడీగా ఉన్నారు. తాజాగా సుకుమార్,మహేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాను సైతం భారీగా తీస్తున్నారు. అందులో ఒక పాట నిమిత్తం రెండున్నర కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత గోపీచంద్ ఆచంట సైతం ఖరారు చేస్తున్నారు.
మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దూకుడు చిత్ర నిర్మాతలైన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్‌పై రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు గతంలో ఎన్నడూ లేని విధంగా యంగ్ అండ్ డైనమిక్‌గా, వయసు చాలా తక్కువ ఉన్న కుర్రాడిలా కనిపించబోతున్నాడు. ఇందు కోసం మహేష్ ప్రత్యేకంగా వర్కౌట్లు చేయడంతో పాటు స్పెషల్ డైట్ తీసుకుంటున్నాడు.
ఇక ఫస్ట్ షెడ్యూల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పూర్తైంది. రెండో షెడ్యూల్ ఈ నెలాఖరున ప్రారంభించేందుకు దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేసుకున్నాడు. త్వరలోనే తేదీ ఖరారు కానుంది. ఈ గ్యాప్‌లో మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు రూపొందిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం షూటింగులో పాల్గొంటునున్నారు.
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కాజల్ నటిస్తోంది. ఇందులో మహేష్ కాలేజీలో లెక్చరర్ గా కనిపిస్తారు. సుకుమార్ తన దైన శైలిలో కాలేజి సీన్స్ రాసుకున్నారని వినపడుతోంది. పూర్తి ఫన్ తో కాలేజీ లెక్చరర్ కీ,స్టూడెంట్స్ కీ మధ్య నడిచే కథతో ఈ చిత్రం రూపొందుతోందని చెప్తున్నారు. సుకుమార్ గతంలో లెక్చరర్ గా చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











