'పంజా' దర్శకుడు ఆ తెలుగు హీరోతో ...
'పంజా'తో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు విష్ణు వర్ధన్. ఆయన తన తదుపరి చిత్రం మహేష్ తో చేస్తారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఓ స్టార్ ప్రొడ్యూసర్ వీరిద్దరి కాంబినేషన్ లో చిత్రం చేయాలని సంకల్పించి మహేష్ ని కలిసి ఓకే చేయించుకున్నాడని టాక్. ఆ నిర్మాత లాస్ ల్లో ఉండటంతో మహేష్ ఆయనకు సహాయం చేయాలనే ఓ ప్రాజెక్టు చేస్తానని మాట ఇచ్చినట్లు, ఇప్పుడు ఈ చిత్రంతో అది కార్యరూపం దాల్చనున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక తన డేట్స్ ఖాళీ లేకపోయినా, ఆ నిర్మాత కోసం డేట్స్ ఎడ్జెస్ట్ చేసి, తన విరామ సమయం తగ్గించుకుంటానని మాట ఇచ్చినట్లు చెప్తున్నారు. అయితే విష్ణు వర్ధన్ మాత్రం కథని రెడీ చేసి ఓకే చేయించుకోవాలని, కథ నచ్చిన తర్వాత మాత్రమే డేట్స్ గురించి మాట్లాడతానని ఖచ్చితంగా చెప్పినట్లు సమాచారం.
ఇక విష్ణువర్దన్ మాత్రం - 'మహేష్‌బాబుతో సినిమా తీయాలనుంది. మేమిద్దరం చెన్నైలో క్లాస్‌మేట్స్‌మి. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా ఓ సినిమా చేయాలనుంది' అంటున్నాడు. ప్రస్తుతం మహేష్ 'ది బిజినెస్‌మేన్' సినిమా బిజీలో ఉన్నారు. సంక్రాంతికి విడుదల అయ్యే ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. పోకిరి కాంబినేషన్ లో రెడీ అవుతున్న ప్రాజెక్టు కావటం, దూకుడు వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావటంతో ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications











