twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెరీ ఇంట్రెస్టింగ్: విజయ్ దేవరకొండ బాటలో మహేష్ బాబు.. మరో అడుగు ముందుకేసి..

    |

    Recommended Video

    Super Star Mahesh Babu To Follow Vijay Devarakonda || Filmibeat Telugu

    నేటితరం యంగ్ హీరో హీరోయిన్లు చాలా డిఫెరెంట్‌గా ఆలోచిస్తున్నారు. కేవలం సినిమానే లోకం అనుకోకుండా పలు విదాలుగా డబ్బు సంపాదించే ఆలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరోలు బిజినెస్‌మాన్‌లుగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు విజయ్ దేవరకొండ బాటలో మహేష్ బాబు అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. అదెలాగంటారా? వివరాలు చూస్తే..

    రౌడీ బ్రాండ్.. విజయ్ దేవరకొండ

    రౌడీ బ్రాండ్.. విజయ్ దేవరకొండ

    టాలీవుడ్ యంగ్ హీరో ఇప్పటికే రౌడీ బ్రాండ్ దుస్తుల పేరిట వ్యాపార రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్రాండ్‌కి మంచి గుర్తింపు లభించడమే గాక ఓ రేంజ్‌లో వ్యాపారం సాగుతోంది. ప్రస్తుతం ఈ బ్రాండ్‌లో పురుషుల దుస్తులు మాత్రమే లభ్యమవుతుండగా.. మరికొద్ది రోజుల్లో మహిళా దుస్తులు కూడా లాంచ్ చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ.

    విజయ్ బాటలోనే మహేష్

    విజయ్ బాటలోనే మహేష్

    ఇప్పటికే సొంత నిర్మాణ సంస్థ, ఏఎంబీ మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభించి జోరుగా వ్యాపార కార్యక్రమాలు చేస్తున్న మహేష్ బాబు.. ఇకపై విజయ్ బాటలో దుస్తుల మార్కెట్ లోకి కూడా ప్రవేశించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ మేరకు తన సొంత దుస్తుల బ్రాండ్ ఏర్పాటు చేసే దిశగా సన్నాహాలు ప్రారంభించారట మహేష్ బాబు.

     అదొక్కటే కాదు.. మరో అడుగు

    అదొక్కటే కాదు.. మరో అడుగు

    మహేష్ బాబు సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆయన దుస్తుల బ్రాండ్ తో పాటుగా సొంతంగా ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్ కూడా ఏర్పాటు చేయనున్నాడని తెలిసింది. ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా తన సొంత బ్రాండ్ దుస్తులతో పాటుగా ఇతర బ్రాండ్స్‌ని కూడా అందుబాటులో ఉంచుతారట మహేష్. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

    భార్య నమ్రత కోసమేనా?

    భార్య నమ్రత కోసమేనా?

    ఇటు సినిమాల్లో నటిస్తూనే బిజినెస్ వ్యవహారాలతో బిజీ కాబోతున్నాడట సూపర్ స్టార్ మహేష్ బాబు. తన వ్యాపార కార్యక్రమాలను మరింత విస్తరించి భార్య నమ్రతను మేనేజింగ్ హెడ్ చేసే ఆలోచనలో ఉన్నారట మహేష్. ఇక ఇప్పటికే మహేష్ కూతురు సితార కూడా సొంతంగా యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

    మహేష్.. సరిలేరు నీకెవ్వరు

    మహేష్.. సరిలేరు నీకెవ్వరు

    మహర్షి తర్వాత మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి ముఖ్యపాత్ర పోషిస్తోంది.

    English summary
    As per the lastest news Mahesh Babu starts a new business. He is going to establish a new online platform with selling of dresses on his own and differnt brands.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X