మహేష్ బాబు ముంబై ప్రయాణం ఎందుకంటే...
రీసెంట్ గా పూనెలో ఓ నెల రోజులు పాటు గడిపిన మహేష్ బాబు జూలై ఒకటి నుంచి ముంబైలో మకాం వేయనున్నారు. అక్కడ ఓ రెండు పాటల షూటింగ్ జరగనుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందతున్న ఈ చిత్రంకిదే లాస్ట్ షెడ్యూల్. ఈ పాటలతో పూర్తి స్ధాయిలో షూటింగ్ పూర్తి కానుంది. హీరోయిన్ గా అనూష్క చేస్తున్న ఈ చిత్రం ఆగస్టు తొమ్మిదిన రిలీజ్ కానుంది. ఆ రోజు మహేష్ బాబు పుట్టినరోజు కావటంతో ఆ డేట్ నిర్ణయించారు.
అతడు వంటి హిట్ చిత్రం అనంతరం మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక పవన్ తో పులి చిత్రం నిర్మిస్తున్న శింగనమల రమేష్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఇక అతిధి చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తో ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఇక ఈ చిత్రం తర్వాత శ్రీనువైట్లతో చేసే చిత్రం ప్రారంభించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత సురేంద్ర రెడ్డితో మిస్టర్ ఫెరఫెక్ట్, లింగుస్వామితో చేసే చిత్రం ఉంటుంది.


Click it and Unblock the Notifications











