Mahesh Babu 'గుంటూరు కారం' అసలు స్టోరీ లీక్.. అందుకే టైటిల్ మార్చారా?

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టాడు మహేశ్ బాబు. హ్యాండ్సమ్ అండ్ మాస్ హీరోగా అతి తక్కువ కాలంలోనే విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నాడు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ చాలా కాలంగా సత్తా చాటుతున్నాడు.

ఇక అందగాడు అనే పదానికి పర్ఫెక్ట్ అడ్రస్ గా అమ్మాయిల్లో మనసులను అల్ల కల్లోలం చేసే మహేశ్ బాబు సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తో మహేశే చేసే గుంటూరు కారం సినిమా అసలు స్టోరీ లీక్ అయింది. అదేంటనే వివరాల్లోకి వెళితే..

Mahesh Babu Guntur Karam Movie Story Leaked As Per Amaravathiki Atu Itu Title

సూపర్ హిట్స్: బాల నటుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఒక్కడు, పోకిరి, దూకుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో సూపర్ స్టార్ అనే స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. గతేడాది 'సర్కారు వారి పాట' సినిమాతో అలరించిన మహేశ్ బాబు ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న విషయం తెలిసిందే.

Mahesh Babu Guntur Karam Movie Story Leaked As Per Amaravathiki Atu Itu Title

హీరోయిన్లు: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు అడ్వెంచర్ సినిమా SSMB29 ప్రతిష్టాత్మక సినిమా చేస్తున్నాడు. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో SSMB28గా వస్తున్న గుంటూరు కారం ఒకటి. హారిక హాసినీ క్రియేషన్స్, సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు.

Mahesh Babu Guntur Karam Movie Story Leaked As Per Amaravathiki Atu Itu Title

ఇవే టైటిల్స్: అతడు, ఖలేజా తర్వాత గుంటూరూ కారం సినిమా మహేశ్ బాబుతో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్న మూడో సినిమా కావడంతో అటు ప్రేక్షకుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ కాకముందు 'అర్జునుడు', 'అతడే పార్థు', 'అమరావతికి అటూ ఇటూ' వంటి టైటిళ్లు పరిశీలించిన విషయం తెలిసిందే.

Mahesh Babu Guntur Karam Movie Story Leaked As Per Amaravathiki Atu Itu Title

గట్టిగా అనుకుంది: ఆ మూడు టైటిళ్లలో ఎక్కువగా వినిపించిన పేరు 'అమరావతికి అటూ ఇటూ'. టైటిల్ క్యాచీగా ఉండటం, కథకు టైటిల్ దగ్గర సంబంధం ఉండటంతో దాదాపుగా ఇదే పేరును ఫిక్స్ అయ్యారట మేకర్స్. కానీ, ఏం జరిగిందో తెలియదు కానీ.. చివరికీ మాత్రం గుంటూరు కారం అని మార్చారు. పత్రికల్లో వచ్చే శీర్షికలా ఉందని ఈ టైటిల్ పై కామెంట్స్ కూడా వచ్చినట్లు టాక్.

Mahesh Babu Guntur Karam Movie Story Leaked As Per Amaravathiki Atu Itu Title

అసలు కథ: ఇదిలా ఉంటే 'అమరావతికి అటూ ఇటూ' టైటిల్ అనుకోవడానికి గట్టి కారణం సినిమా స్టోరీనట. ఈ సినిమా మొత్తం అమరావతి సమీపంలో జరుగుతుందట. ఇందులో మహేశ్ బాబు తల్లిదండ్రులు విడిపోయి అమరావతి పరిసరాల్లో విడివిడిగా ఉంటారని టాక్. అంటే.. అటు అమ్మా.. ఇటు నాన్న అన్నట్లుగా ఉంటుందట. అందుకే అలా టైటిల్ అనుకున్నారట. కారణాలు తెలియనప్పటికీ టైటిల్ మారిన.. కథ మాత్రం అదే అని నెట్టింట్లో తెగ చర్చ నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X