మహేష్ బాబు కోసం కథ సిద్ధం చేస్తున్న ‘గీత గోవిందం’ డైరెక్టర్?
తెలుగు డైరెక్టర్ పరశురాం చాలా కాలం తర్వాత 'గీత గోవిందం' ద్వారా బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం రూ. 100 కోట్లకుపైగా వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
దీని తర్వాత ఈ డైరెక్టర్... అల్లు అర్జున్ హీరోగా సినిమా చేయాలని ప్లాన్ వేసుకున్నాడు. బన్నీని తన కథతో ఒప్పిస్తే అల్లు అరవింద్ నిర్మిస్తానని హామీ ఇచ్చాడు. అయితే అది వర్కౌట్ కాలేదు. బన్నీ వరుసగా ఇతర డైరెక్టర్లతో మూడు ప్రాజెక్టులకు కమిట్మెంట్ కూడా ఇచ్చేశాడు.
అల్లు అర్జున్‌తో సినిమా ఓకే కాలేదనే డిసప్పాయింట్మెంటులో ఉన్న పరశురాంకు మరో రకంగా లక్కు కలిసొచ్చినట్లు తెలుస్తోంది. మంచి కథతో వస్తే అతడితో సినిమా చేయడానికి మహేష్ బాబు సిద్ధంగా ఉన్నారట. ఈ విషయం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

మహేష్ బాబు, సుకుమార్ మూవీ రద్దయిన వెంటనే... అల్లు అరవింద్ వెళ్లి మహేష్ బాబు భార్య నమ్రతను కలిశారట. సుకుమార్, అల్లు అర్జున్ సినిమా విషయంలో క్లారిఫికేషన్ ఇచ్చేందుకే అతడు వెళ్లినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అసలు నిజం ఏమింటంటే... గీతా ఆర్ట్స్ బేనర్లో మహేష్ బాబుతో సినిమా సెట్ చేయాలనే ఉద్దేశ్యంతో అరవింద్ వెళ్లినట్లు టాక్.
ఈ సందర్భంగా అల్లు అరవింద్... పరశురాం వద్ద మంచి కథ ఉందని, మహేష్ బాబుకు సూటువుందని, కథ విని ఒకే చెబితే తాను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారట. ప్రస్తుతం పరశురాం మహేష్ బాబును ఒప్పించే విధంగా స్క్రిప్టు సిద్దం చేసే పనిలో బీజీగా ఉన్నారట.


Click it and Unblock the Notifications











