మహేష్ బాబుకి కేవలం యాడ్స్ ద్వారానే అంతొస్తుందా?
ప్రిన్స్ మహేష్ బాబుకి సినిమాలపై కన్నా యాడ్స్ పై దృష్టి బాగా పెరిగిందని రెగ్యులర్ గా టీవీ చూసే వారెవరైనా చెప్పేయగలుగుతారు.ఎందుకంతలా యాడ్స్ మీద మహేష్ అంతలా ఆధారపడుతున్నాడూ అంటే ఆయనకు యాడ్స్ పై వచ్చే ఆదాయం చూస్తే కళ్ళు తిరుగుతుంది. సంవత్సరానికి ఆయన ఆదాయం కేవలం యాడ్స్ లో నటించటం ద్వారా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అని అంచనా.
షూటింగ్ డేస్ బాగా తక్కువ..ఆదాయం ఎక్కువ ..సినిమాతో పోలిస్తే అందుకే్ మహేష్ అలా ఫిక్సయ్యాడు.ఇక ఇప్పటికే మహేష్ ...యూనివర్సిల్, నవరత్న హెయిర్ ఆయిల్, ధమ్స్ అప్, వివెల్, ఐడియా,అలూకాస్, ప్రోవోగ్,అమృతాంజన్ అంటూ పన్నెండు కంపెనీలకు పనిచేస్తున్నాడు.మరిన్ని కంపెనీలు ఆయన ఓకే అనటం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ కేవలం శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న దూకుడు లో మాత్రమే కనిపిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











