twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ రెమ్యునేషన్ 8 కోట్లా?

    By Staff
    |

    {image-mahesh babu_15052008.jpg telugu.filmibeat.com}త్రివిక్రమ్ దర్శకత్వంలో శింగమల రమేష్ నిర్మిస్తున్నక్రేజి చిత్రం 'వరుడు'. ఆ సినిమా గురించి ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. నిర్మాత రెమ్యునేషన్ నిమిత్తం మహేష్ బాబుకి 8 కోట్లు , త్రివిక్రమ్ కి 4.5 కోట్లు ఇచ్చారని ...అలాగే 30 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కించబోతున్నరనేది ఆ వార్తల సారాంశం. ఇది విన్న కొందరు హీరోలు, దర్శకులు తమ రెమ్యునేషన్స్ పెంచాలని పి.ఆర్ లతో చర్చిస్తున్నారుట . మరో ప్రక్క ఈ వార్త నిర్మాతల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోందిట. కొందరైతే ఇది నేషనల్, ఓవర్ సీస్ మార్కెట్ ఉన్న బాలీవుడా అని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారుట.

    కాని ఇప్పుడున్న పరిస్ధితుల్లో డబ్బు గురించి ఆలోచిస్తే పెద్ద హీరోల డేట్స్ దొరకవు...అలా స్పీడుగా ఉన్నాడు కాబట్టే శింగమల రమేష్ పవన్ తో 'పులి', మహేష్ తో 'వరుడు' యేక కాలంలో ప్రారంభించాడని మరికొందరు ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు సమర్ధస్తున్నారట. యేది ఎలా ఉన్నా ఈ సినిమా పై మంచి హోప్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమా మొత్తం ఫన్ కలిసిన రొమంటిక్ ఎడ్వంచర్స్ తో సాగుతుందిట. ఎలాగో త్రివిక్రమ్ తరహా పంచ్ లు ఉండనే ఉంటాయి. మహేష్ స్టైలిష్ యాక్షన్ తప్పనిసరి. అలాగే వీరి కాంబినేషన్లో గతంలో వచ్చి హిట్టైన 'అతడు' సినిమాకి పూర్తి భిన్నంగా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారుట.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X