మహేష్ బాబు వాణిజ్య ప్రకటనల వల్ల మహర్షికి చిక్కులు.. ఏం జరిగిందంటే!

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. మహర్షి మహేష్ బాబు 25వ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. భరత్ అనే నేను తర్వాత మహేష్ నటిస్తున్న మరో సందేశాత్మక చిత్రం ఇది. మహర్షి చిత్ర విడుదల పలుమార్లు వాయిదా పడింది. ఏప్రిల్ లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం మే 9కి వాయిదా వేశారు. మహర్షి చిత్ర షూటింగ్ ఇంత నెమ్మదిగా జరగడానికి మహేష్ బాబే కారణం అంటూ వార్తలు వస్తున్నాయి.

 రెండుసార్లు వాయిదా

రెండుసార్లు వాయిదా

మహర్షి చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి చాలా కేర్ తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం కోసం వంశీ దాదాపుగా రెండేళ్లు ఎదురుచూశాడు. వంశీ షూటింగ్ ని పక్కాగా ప్లాన్ చేసుకున్నా ఆలస్యం జరుగుతూనే ఉంది. ఇంకా మహర్షి షూటింగ్ పూర్తి కాలేదు. మొదట మహర్షి చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ తేదీని వాయిదా వేసి ఏప్రిల్ 25 అన్నారు. అది కూడా వాయిదా పడింది. ప్రస్తుతం మహర్షి చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో మే 9న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ కష్టపడుతోంది.

మహేష్ బాబే కారణం

మహేష్ బాబే కారణం


మహర్షి చిత్రంలో ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలి ఉంది. సాంగ్స్ చిత్రీకరించాల్సి ఉంది. ఇంతలా మహర్షి చిత్రం వాయిదా పడడానికి కారణం మహేష్ బాబే అని వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు తరచుగా వాణిజ్య ప్రకటనల్లో పాల్గొనుతుండడంతో షూటింగ్ కి అంతరాయం ఏర్పడుతోందట. మహేష్ బాబు బాలీవుడ్ స్టార్స్ తో పోటీ పడుతూ కార్పొరేట్ సంస్థలకు వాణిజ్య ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ హీరోలకు ధీటుగా

బాలీవుడ్ హీరోలకు ధీటుగా

కార్పొరేట్ సంస్ధలు ఎండార్స్ మెంట్ విషయంలో మహేష్ బాబు సౌత్ హీరోల్లో ప్రధమ స్థానంలో కొనసాగుతున్నాడు. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్, షారుఖ్ లకు ధీటుగా మహేష్ బాబు వాణిజ్య ప్రకటనలు చేస్తున్నాడు. మహేష్ క్రేజ్ గుర్తించిన కార్పొరేట్ సంస్థలు కోట్లల్లో రెమ్యునరేషన్ అందిస్తూ తమ ఉత్పత్తులకు మహేష్ ని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుంటున్నాయి. ఓవైపు సినిమాలు, మరోవైపు వాణిజ్య ప్రకటనలతో మహేష్ బిజీగా గడుపుతున్నాడు.

నెక్స్ట్ మూవీలో వాటా

నెక్స్ట్ మూవీలో వాటా

ఇదిలా ఉండగా మహేష్ బాబు తదుపరి చిత్రం వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడితో ఉండబోతోంది. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రంలో మహేష్ రెమ్యునరేషన్ కి బదులు థియేట్రికల్ రైట్స్ లో వాటా తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అనిల్ రావిపూడి కూడా ఈ చిత్రానికి భారీ పారితోషికం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X