మహేశ్ బాబు ఖలేజా ఫస్ట్ హీరోయిన్.. అనుష్కకు ముందే ఆమెతో షూటింగ్ పూర్తి
మహేశ్ బాబు ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మహేశ్ బాబు సరసన నటించాలని ఎంతో మంది హీరోయిన్లు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాబు పక్కన నటించిన హీరోయిన్లకు మంచి మంచి అవకాశాలు ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఓ హీరోయిన్ కు మహేశ్ బాబుతో ఖలేజా సినిమాలో నటించే అవకాశం వచ్చి.. కొన్నాళ్లు షూటింగ్ జరిగాక ఆమె తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆమె ఎవరు? ఏంటనే వివరాల్లోకి వెళితే..
మహేశ్ బాబు ఖలేజా సినిమా వివరాలు..
కనకరత్న మూవీస్ బ్యానర్ పై రూ. 30 కోట్లతో రూపుదిద్దుకుంది ఖలేజా చిత్రం. 2010లో గ్రాండ్ గా విడుదలైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మహేశ్ బాబు సరసన నటించింది. కానీ ఈ చిత్రం ఇటు ప్రేక్షకుల నుంచి అటు బాక్సాఫీస్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.18 కోట్లు మాత్రమే వసూల్ చేసింది.

రీ రిలీజ్ సందర్భంగా ఇంట్రెస్టింగ్ న్యూస్..
ఖలేజా సినిమాను తాజాగా రీరీలిజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతుండటంతో ఇప్పటికే మహేశ్ బాబుకు సంబంధించిన ఒక్కడు, బిజినెస్ మెన్, పోకిరీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు వంటి చిత్రాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇక తాజాగా 'ఖలేజా' చిత్రం కూడా విడుదలైంది. మే 30న రీ రిలీజ్ ప్రారంభం కాగా.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. కేవలం 2 రోజుల్లోనే రూ.16 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఖలేజా సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. ఈ చిత్రంలో ఫస్ట్ హీరోయిన అనుష్క శెట్టి కాదని, మహేశ్ బాబు నటించాల్సిన హీరోయిన్ మరొకరు ఉన్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది.
ఆమె ఎవరు? ఇప్పుడేం చేస్తోంది..
త్రివిక్రమ్ శ్రీనివాస్ - మహేశ్ బాబు కాంబినేషన్ లోని ఖలేజా చిత్రానికి మొదటగా పార్వతీ మెల్డన్ ను హీరోయిన్ గా ఫైనల్ చేశారంట. అప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో అప్పటికే పార్వతీ మెల్టన్ 'జల్సా' చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ప్రారంభమైన ఖలేజా చిత్రంలో ఫస్ట్ హీరోయిన్ గా పార్వతీ మెల్టన్ ను తీసుకున్నారంట. కొంత మేర షూటింగ్ కూడా పూర్తి చేశారంట. కానీ ఏదో సమస్య వచ్చి అనుష్క శెట్టి తీసుకున్నారంట. అప్పుడు గనుక పార్వతీ మెల్టన్ మహేశ్ బాబు సరసన నటించి ఉంటే ఆమె రేంజ్ వేరేలా ఉండేది. కానీ దూకుడు చిత్రంలో స్పెషల్ డ్యాన్స్ తో అదరగొట్టింది. 2012 వరకు సినిమాల్లో మెరిసినా ఆ తర్వాత నుంచి ఇండస్ట్రీకి దూరమై పోతోంది.
మహేశ్ బాబు - రాజమౌళి చిత్రం..
చివరిగా మహేశ్ బాబు గుంటూరు కారం చిత్రంతో అలరించాడు. ఆ సినిమాకు త్రివిక్రమే దర్శకత్వం వహించాడు. ఇక ఇప్పుడు బాబు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో SSMB29 చిత్రంలో నటిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ్ ఈ చిత్రాన్ని రూ.1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణీ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











