దేవుడు..మహేష్ బాబు రూపంలో రాబోతున్నాడా?
మహేష్ బాబు, త్రివిక్రమ్ ల కాంబినేషన్ చిత్రానికి 'ఖలేజా" అనే టైటిల్ ని ఖరారు చేసి ట్విట్టర్ లో వదిలిన సంగతి తెలిసిందే. ఇప్పుడా చిత్రానికి ట్యాగ్ లైన్ ఓ వాక్యం పెట్టనున్నారని తెలుస్తోంది. అది మరేదో కాదు...'దేవా మానుష్య రూపేణా". ఈ వాక్యం అర్దం..'దేవుడు మనిషి రూపంలో" అని అర్థ్ధం. ఇక 'ఖలేజా" చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్ నిర్మిస్తున్నారు. మహేష్ బాబు సరసన అనుష్క నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే మహేష్ బాబుకు మూడక్షరాల టైటిల్స్ తో గల సెంటిమెంట్ గురించి తెలిసిందే. మహేష్ బాబుకు మొట్టమొదటి విజయం అందించిన 'మురారి", సూపర్ హిట్ ఇచ్చిన 'ఒక్కడు" చిత్రాలతోపాటు మహేష్ బాబును సూపర్ స్టార్ ను చేసిన 'పోకిరి", అతడు ఇవన్నీ మూడక్షరాల టైటిల్సే కావడం గమనార్హం. కాబట్టి ఆ చిత్రాలలాగే ఈ చిత్రం కూడా సంచలన విజయం సాధిస్తుందని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











