మహేష్ బాబు-కొరటాల శివ మూవీ వాయిదా?
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ సినిమా ఈ నెల 9న విడుదన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. ఈ నెల 24 షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ‘ఆగడు' సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడటంతో మహేష్ బాబు ఈ చిత్రంపై ప్రత్యేక దృష్టి పుట్టినట్లు తెలుస్తోంది. స్క్రిప్టులో మార్పులు చేయాలని మహేష్ బాబు కోరినట్లు సమాచారం. అందుకే సినిమా వాయిదా పడిందని తెలుస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం...మహేష్ బాబు వెకేషన్ కోసం బ్యాంకాక్ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి నుండి మలేషియా సందర్శిస్తారని తెలుస్తోంది. ఇండియా వచ్చిన తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో జరిగే షూటింగులో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్.

అక్టోబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ 9వ తేదీ నుండి జరుగుతుందని నిర్మాతలు తెలిపారు. మహేష్ బాబు షూటింగులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండటం వల్లనే వారు ఆ ప్రకటన చేసారు. అయితే ఉన్నట్టుండి మహేష్ బాబు వెకేషన్ వెళ్లడం, సినిమా షూటింగ్ వాయిదా పడటం పలు అనుమానాలకు తావిస్తోంది.
నిర్మాతలు ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ మాట్లాడుతూ...‘మా మైత్రి మూవీ మేకర్స్ బేనర్లో సూపర్ స్టార్ మహేష్ గారితో చేస్తున్న తొలి చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 9న ప్రారంభమవుతుంది. మీడియాలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని టైటిల్స్ వినిపిస్తున్నాయి. కానీ, ఇంత వరకు ఈ చిత్రానికి టైటిల్ నిర్ణయించలేదు. టైటిల్ నిర్ణయించిన తర్వాత అపీషియల్ గా మేమే ఎనౌన్స్ చేస్తాము. మా బేనర్లో తొలి చిత్రమే సూపర్ స్టార్ మహేష్ గారితో చెయ్యడం మా అదృష్టం. మాకు ఇచ్చిన ఈ అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేశాం. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించేలా ఈ చిత్రం ఉంటుంది' అన్నారు.


Click it and Unblock the Notifications











