పవన్ ఫ్యాన్స్ తోటి శభాష్ అనిపించుకున్న మహేష్ బాబు..!?
తోటి హీరోల గురించి గొప్పగా మాట్లాడ్డానికి, వారి గురించిన మంచి చెప్పడానికి ఈగోలు అడ్డొచ్చే మన తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి బేషజాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే హీరోలు కొందరున్నారు. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముందుంటారు. 'కొమరం పులి" ఆడియో రిలీజయిన సందర్భంగా ఆ యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెప్పిన మహేష్ తనకి పవన్ కళ్యాణ్ పట్ట వున్న గౌరవాన్ని, ఇష్టాన్ని కూడా బయట పెట్టాడు.
'పులి" ఆడియో ఫంక్షన్ లో పవన్ బాగా మాట్లాడాడని, అది నేను టీవీలో చూశానని చెప్పారు. మేము కలుసుకున్నది రెండు, మూడు సార్లే అయినా 'అర్జున్" పైరసీ పై నేను పోరాడిన సందర్భంలో పవన్ నాకు ఇచ్చిన సపోర్ట్ నేనెప్పుడూ మరచిపోలేను. అప్పుడు ముందుగా నాకు అండగా నిలిచిన వారిలో పవన్ కూడా వున్నారు. నాకు బాగా ఇష్టమైన వారిలో పవన్ ఒక్కరు. అతని మంచినే నేనెప్పుడూ కోరుకుంటాను. ఎప్పటిలాగే 'పులి" చిత్రంలో కూడా పవన్ అదరగొడతాడని ఆశిస్తున్నాను" అంటూ మహేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
పవన్ కళ్యాణ్ పట్ట మహేష్ బాబు అభిమాన్ని చూసిన మెగాఫ్యాన్స్ కూడా ప్రిన్స్ గ్రేట్ నెస్ కి ఫిదా అయిపోయి హేట్సాఫ్ చెబుతున్నారు. పవన్ పట్ల తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయకపోయినా మహేష్ ని ఎవరూ ఏమీ అనరు. అయినా కానీ పవన్ పట్ల తన ఇష్టాన్ని వ్యక్తపరిచి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications