ఆమెతో మహేష్ బాబు లిప్ లాక్ కిస్
మహేష్ బాబు తాజా చిత్రం ది బిజినెస్ మ్యాన్ లో కాజల్ తో లిప్ లాక్ కిస్ ఇచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆ సీన్ హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. ఆ సీన్ లో కాజల్ బెడ్ పై రెస్ట్ తీసుకుంటూంటే మహేష్ ఆమెపై దూకి లిప్ లాక్ కిస్ ఇస్తాడని చెప్పుకుంటున్నారు. ఇక ఇది రూమరా నిజమా అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకూ వెయిట్ చేయాల్సిందే. ఇక మహేష్ బాబు ఈ చిత్రంలో స్వయంగా పాట పాడుతున్నారు. ధీమ్ మ్యూజిక్ తో సాగే ఆ పాట సినిమాలో హైలెట్ కానుందని సమాచారం. అలాగే బిజినెస్ మ్యాన్ పాటలు డిసెంబర్ 18 న విడుదల అవుతాయి.
ఇక ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం..కొనుగోళ్ళు ..అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది.ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేస్తున్నారు.గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం ముంబై మాఫియాకి చెందిన కథగా తెరకెక్కుతోంది. 'బిజినెస్‌మ్యాన్'గా టైటిల్‌కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఆయన రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











