ఆమె పెదాలను మళ్లీ జుర్రుకోనున్న మహేష్ బాబు?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 'బిజినెస్ మేన్' చిత్రంలో కాజల్ అగర్వాల్‌తో జతకట్టి ముద్దు సీన్లను యమ రంజుగా పండించాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న తన తాజా సినిమాలోనూ ఆమె పెదాలు మరోసారి జుర్రుకోనున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.
సుకుమార్ ఈచిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా రూపొందిస్తున్నాడు. స్కిప్టులో భాగంగా ఘాటైన ముద్దు సీన్ తప్పనిసరట. మహేష్ బాబు-కాజల్ ఇప్పటికే ఒకసారి ముద్దు సీన్లు చేసారు. ఈ నేపథ్యంలో సుకుమార్ విషయం చెప్పగానే వెంటనే ఓకే చెప్పారని సమాచారం.
కాజల్ కు ముద్దు సీన్లలో ఇప్పటికే మంచి అనుభవం ఉంది. చందమామ, ఆర్య2 చిత్రాల్లో అమ్ముడు ముద్దు సీన్లను ఎంతో ఇష్టంగా పండించింది. అయితే మహేష్ బాబు మాత్రం ఇప్పటి వరకు తెరపై ఇలాంటి ఫీట్లు అరుదుగా మాత్రమే చేశాడు. ఆ మధ్య నాని చిత్రంలో అమీషా అదరాలను తన పెదాలతో టచ్చ్ చేస్తూ ఓ ఫోటోకు మాత్రం ఫోజిచ్చాడంతే. కాజల్‌తో బిజినెస్ మేన్ చిత్రంలో ముద్దు సీన్ చేశాక మన హీరోకి ధైర్యం మరింత పెరిగినట్లుంది. అందుకే కాజల్‌తో మరోసారి సై అన్నాడట.
మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సినిమా కథ విషయానికొస్తే... గోవా బ్యాక్ డ్రాప్‌తో ఈ చిథ్ర కథ నడుస్తుందట. అంతే కాకుండా ఇందులో మహేష్ బాబు లెక్చరర్ పాత్రలో తొలిసారిగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం మహేష్ బాబు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. వెంకటేష్, మహేష్ బాబు, సమంత, అంజలి ప్రధాన పాత్రలుగా మల్టీ స్టారర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











