సుకుమార్ చిత్రంలో మహేష్ లుక్ ఇదే (ఫోటో)
హైదరాబాద్: మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్ గా కనిపించనున్నారు. అందుకోసం దర్శకుడు కొత్తలుక్ తో ప్రెజెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఫోటటో కనిపిస్తున్నది మహేష్ బాబు న్యూలుక్. మహేష్ హెయిర్ స్టయిల్ తో పాటు బాడీలో కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయి కదా... పలు జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ లుక్ ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ ఫోటో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. అభిమానులను అలరిస్తోంది.
మొదటినుంచీ మహేష్ బాబు తన హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, బాడీ లాంగ్వేజ్ దాకా ప్రతీ చిత్రంలోనూ ఢిఫెరెంట్ గా చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా పోకిరి నుంచి ఆయన పూర్తిగా ఢిఫెరెంట్ లుక్ తో కనిపిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలోనూ ఆయన మొత్తం ఓవరాల్ గా కొత్తదనాన్ని ప్రెజెంట్ చేయటానికి, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఇప్పటివరకూ కనిపించని ఆల్ట్రా మోడ్రన్ లుక్ లో కనిపించనున్నారు. ఆ లుక్ ఫ్యాన్స్ ని పూర్తిగా అలరిస్తుందని భావిస్తున్నారు.
దర్శకుడు సుకుమార్ తన హీరోలను విభిన్నంగా చూపుతూ వస్తున్నారు. ఆర్య, ఆర్య 2లలో అల్లు అర్జున్ ని స్టైలిష్ గా చూపారు. అలాగే నాగచైతన్యను ఇంతకు ముందు ఎవరూ చూపని విధంగా 100% లవ్ లో ప్రెజెంట్ చేసారు. ఇప్పుడు ఆయన మహేష్ ని కొత్త అవతారంలో మరింత అందంగా చూపటానికి, తన రెగ్యులర్ కెమారామెన్ రత్నవేలుతో కలిసి ప్రతీ ఫ్రేమ్ అందంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం గోవాలో ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. మహేష్‌పై ఇటీవలే ఓ పాటను తెరకెక్కించారు. ఈ నెలాఖరు వరకూ అక్కడే కీలకమైన సన్నివేశాల్ని కూడా తెరకెక్కిస్తారు.
మహేష్ బాబు హీరోగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. కృతి సనన్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట నిర్మాతలు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కట్టడం ఇదే తొలిసారి. 'ఆచార్య' అనే పేరును పరిశీలిస్తున్నారు. ''వినోదాత్మకంగా సాగే సినిమా ఇది. మహేష్ పాత్ర విభిన్నంగా సాగుతుంది'' అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
'రెబల్' చిత్రంలో గ్యాంగ్ స్టర్ బ్రదర్‌గా విలన్ పాత్ర పోషించిన విక్రమ్ సింగ్...మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో కూడా బ్యాడ్ బాయ్ పాత్రలో మహేష్ బాబుతో ఫైట్ చేస్తున్నాడు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఈచిత్రం షూటింగులో మహేష్, విక్రమ్ సింగ్ మధ్య ఫైట్ సీన్లు చిత్రీకరించారు. ఈ విషయం గురించి విక్రమ్ సింగ్ ట్విట్టర్లో పేర్కొంటూ.... 'రెబల్ చిత్రం తర్వాత మహేష్ బాబు, సుకుమార్ చిత్రంలో అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. రామ్ లక్షణ్ స్టంట్స్ చాలా బాగా కంపోజ్ చేసారు. నా పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను' అంటూ పేర్కొన్నాడు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పరుచూరి గోపి.


Click it and Unblock the Notifications












