మణిరత్నం రెండు స్క్రిప్టులూ మహేష్ కి...
రీసెంట్ గా మహేష్ బాబుకి ప్రముఖ దర్సకుడు మణిరత్నం రెండు స్క్రిప్టులు వినిపించారు. కానీ ఏదీ ఫైనలైజ్ కాలేదు. మణిరత్నం చెప్పిన స్క్రిప్టులు మహేష్ కి నచ్చకపోవటంతో మరో స్క్రిప్టుతో రావటానికి ఆయన ప్రిపేరయ్యారు. ఇక స్క్రిప్టు ఫైనలైజ్ అయితే ప్రాజెక్టు పైనలైజ్ అయిపోయినట్లే నని తెలుస్తోంది. ఇక రావణ్ వంటి ప్లాఫ్ తర్వాత మణిరత్నం చెయ్యిబోతున్న ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. గీతాంజలి తర్వాత తెలుగు హీరోతో మణిరత్నం రూపొందిస్తున్న చిత్రం ఇదే కావటం విశేషం. ఇక ప్రస్తుతం మహేష్ నటించిన ఖలేజా చిత్రం అక్టోబర్ 7న విడుదలకు సిద్ధమైంది. అనంతరం అక్టోబర్‌లో శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇదేకాక మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించడానికి అంగీకారాన్ని తెలిపాడు. ఇటీవల తమిళ దర్శకుడు లింగుస్వామి చెప్పిన సబ్జెక్టు నచ్చడంతో ఓకే చేసాడు.


Click it and Unblock the Notifications











