ఒక గ్రేట్ దర్శకుని చేతిలో మళ్ళీ మోసపోయిన మహేష్ బాబు...!?
దర్శకుల్లో మణిరత్నంని అభిమానించినంతగా మహేష్ బాబు ఇంకెవరినీ ఇష్టపడి వుండకపోవచ్చు. అందుకే శంకర్ '3 ఇండియట్స్" రీమేకుని కాదనుకొని 'పొన్నియన్ సెల్వం" కోసం వెంపర్లాడిన మహేష్ కి ఏదీ లేకుండా పోయింది. అయినా మణిరత్నం తదుపరి సినిమా ఎప్పుడు మొదలైతే అప్పుడు తనకు అవకాశం కంపల్సరీ అని ఫీలైన మహేష్ బాబుకి మళ్లీ చేదు అనుభవమే ఎదురైంది.
'పొన్నియన్ సెల్వం" ఆగిపోవడంతో ఈ చిత్రంలో హీరోగా అనుకున్న తమిళస్టార్ హీరో విజయ్ కాల్షీట్లు ఖాళీగా పడిపోయాయి. వీటిని ఎలాగైనా వాడుకోవాలనుకున్న మణిరత్నం ఆలస్యం చేయకుండా తన తదుపరి చిత్రం యాక్షన్ కథాంశంతో విజయ్ హీరోగా రూపొందనుందని చాటింపు వేయించేసాడు. అంటే వెయింటింగ్ లో వున్న మహేష్ బాబు డేట్లకన్నా విజయ్ కే ప్రాముఖ్యతనిచ్చిన మణిరత్నంలో అరవం ఫీలింగ్ కన్నా ఎక్కువగా తెలుగు హీరోను చీటింగ్ చేసిన ఫీలింగే ఎక్కువగా కనబడుతోంది. మొత్తం మీద మితిమీరిన అభిమానంతో మహేష్ బాబు రెండో సారి మోసపోయాడు...


Click it and Unblock the Notifications











