బడ్జెట్ సమస్యతో మహేష్ బాబు కొత్త చిత్రం ఆగిపోయినట్లే!?
మణిరత్నం, మహేష్ కాంబినేషన్ లో తమిళ,తెలుగు భాషల్లో 'పోన్నియన్ సెల్వన్'ఓ చిత్రం రూపొందనుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రం ఆగిపోయినట్లు సమాచారం.దానికి కారణం ఈ సినిమా కోసం దాదాపు 100 కోట్లు ఖర్చవుతుందని బడ్డెట్ అంచనాలు వేసారు.పెద్ద స్టార్స్ తో పాటు భారి సెట్టింగ్స్ కూడా ఈ చిత్రం బడ్జెట్ ని పెంచేస్తున్నాయి. చారిత్రక నేపద్యంలో నడిచే ఈ సినిమా రెడీ చేయటంలో ఇంత ఎక్కువ భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్తున్నారు.
అయితే మణిరత్నం రూపొందించిన రావణ్ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్టూర్ కావటంతో అంత బడ్జెట్ పెడితే ఏ మేరకు వస్తుందనే అంచనాలు వేసి ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు.అంతేగాక ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు కూడా పెద్దగా లేకపోవటంతో కూడా భయపడి సినిమాని ఆపుచేసే నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.అయితే ఈ విషయం అఫీషయల్ గా ప్రకటించలేదు.


Click it and Unblock the Notifications











