మహేష్ బాబు... అన్ని టేక్ లు తిన్నాడా?
ఆ సీన్ కోసం మహేష్ చాలా టేక్స్ తీసుకుని..దర్శకుడు సుకుమార్ ని ఒప్పించాడని సమాచారం. ఇక ఇప్పటికి ఈ చిత్రం మొదలై చాలా రోజులు అయినా కేవలం ధర్టి పర్శంట్ మాత్రమే పూర్తైందని తెలుస్తోంది. ఫెరఫక్షన్ అంటూ చాలా టైమ్ ఖర్చి పెడుతున్నాడని అంటున్నారు. అయితే సుకుమార్ ఈ చిత్రాన్ని ఓ ఛాలెంజ్ గా తీసుకుని రూపొందిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నారు. ఈ విషయమై మహేష్ బాబు తన ట్విట్టర్లో ప్రస్తావిస్తూ....'గడిచిన మూడు నెలలు చాలా కష్ట పడ్డాను. వరల్డ్ బెస్ట్ ట్రైనర్ క్రిస్ గెతిన్ పర్యవేక్షణలో న్యూలుక్ కోసం ట్రైనింగ్ తీసుకున్నాను. నా కొత్త లుక్ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది' అంటూ మహేష్ బాబు ట్విట్ చేసారు.
ఈ చిత్రంలో క్రితి సానన్ హీరోయిన్ గా చేస్తోంది. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలో ఈచిత్రానికి టైటిల్ ఖరారు కానుంది. ఈ చిత్రంలో షాయాజీ షిండే, కిల్లి దోర్జీ, విక్రమ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్


Click it and Unblock the Notifications












