Don't Miss!
- News తెర మీదకు వివేకానందరెడ్డి రెండో భార్య..వీడియో వైరల్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
త్రివిక్రమ్, మహేష్ బాబు మల్టీస్టారర్.. మరోసారి ఆ హీరోతోనే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలపై రోజురోజుకు మరింత ఆసక్తి పెరుగుతోంది. ఇద్దరి హీరోలను సమానంగా చూపించడం అంటే చాలా కష్టమైన బాధ్యత అంటూ అప్పట్లో దర్శకులు మల్టీస్టారర్ అంటేనే బయపడేవాళ్లు. కానీ వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోలు మంచి కథలు వస్తే చేయడానికి రెడీ అంటూ ఆల్రెడీ నీరూపించేశారు.
ఇక రాజమౌళి మెగా నందమూరి హీరోలతో భారీ ప్రయోగమే చేస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ లాంటి దర్శకుడు ఇద్దరు హీరోలను డీల్ చేస్తే ఎలా ఉంటుందో ఊహాలకే అందడం లేదు. నెక్స్ట్ మాటల మాంత్రికుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమా మల్టీస్టారర్ కాన్సెప్ట్ అని తెలుస్తోంది.
మహేష్ గుడ్ న్యూస్ చెప్పడంతో..
ఇటీవల ఖలేజా విడుదలై 10ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ బాబు ఒకక్ స్పెషల్ ట్వీట్ తో ఆడియెన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తనలోని సరికొత్త నటుడిని బయట పెట్టిన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సారి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పడంతో ఆడియేన్స్ అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. అతడు, ఖలేజా తరువాత మూడవసారి మహేష్ బాబు, త్రివిక్రమ్ కలవబోతున్నట్లు తెలియడంతో ఒక్కసారిగా ఆ కాంబోపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఇది పక్కా మల్టీస్టారర్..
ఇక త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా స్టార్ట్ చేయాలి అంటే ఇంకా చాలా సమయం పడుతుంది. మహేష్ రాజమౌళితో పాన్ ఇండియా సినిమా చేసిన తరువాత త్రివిక్రమ్ కథ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉందట. అయితే ఆ కథలో మరొక హీరో కూడా ఉంటారని తెలుస్తోంది. ఇది పక్కా మల్టీస్టారర్ ప్రాజెక్ట్ అని రూమర్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి.
మరోసారి ఆ హీరోతోనే
అసలు మ్యాటర్ లోకి వస్తే మహేష్ బాబుతో నటించబోయే ఆ హీరో మరెవరో కాదు. విక్టరీ వెంకటేష్. ఇదివరకే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అన్నదమ్ములుగా కనిపించిన మహేష్, వెంకీ డీసెంట్ గా హిట్టు కొట్టారు. ఆ తరువాత వెంకీ మల్టీస్టారర్ కథలు చేస్తూనే ఉన్నాడు. ఇక మహేష్ మళ్ళీ తన రెగ్యులర్ సినిమాలతో బిజీ అవ్వగా.. ఫైనల్ గా ఇప్పుడు మల్టీస్టారర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Recommended Video
వెంకటేష్ కొసం సిద్ధం చేసిన కథలోనే..
త్రివిక్రమ్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక వెంకటేష్ తో సినిమా ఉంటుందని ఎప్పట్నుంచో టాక్ వస్తోంది. గతంలో ఒకసారి వెంకటేష్ బర్త్ డే సందర్భంగా అందుకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఇక వెంకటేష్ కోసం సిద్ధం చేసిన సింపుల్ ఫ్యామిలి కథలోనే మహేష్ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.