ఖలేజా ప్లాప్ తో మహేష్ లో మొదలైన న్యూ యాక్టివిటీస్...
ప్రిన్స్ మహేష్ అంటే పిచ్చిగా ప్రేమించే అభిమానులను సైతం 'ఖలేజా" నిరాశపరిచిందని ఎట్టకేలకు మహేష్ బాబే ఒప్పేసుకున్నాడు. ట్విట్టర్ పుణ్యమాని'ఖలేజాకి" కావాల్సినంత ఫ్రీ పబ్బిసిటీని ప్రిన్స్ ఇచ్చినప్పటికీ, మార్కెట్ ధాటిని తట్టుకోలేక, మూడేళ్ల నిరీక్షణా భారాన్ని నిలుపుకోలేక, మహేష్ కసిని బాక్సాఫీస్ దగ్గర చూపుకోలేక, 'ఖలేజా" ఖతం అయిపోయింది. ఆ నిజాన్ని ఒప్పుకోని మహేష్ తనేదో ఓ కొత్త ట్రెండ్ చూపించానని కొత్త క్యారెక్టర్ చాలా బాగుందని, ఎంజాయ్ చేశానని విర్రవీగాడు. అయితే ఇప్పుడేమో తను తీసుకున్న మూడేళ్ల రెస్ట్ కూడా వేస్ట్ అయిపోయిందని అందుకే 'ఖలేజా" ఫట్ అయిందని మీడియా ముందు ఒప్పేసుకుంటున్నాడు. ఇప్పటికైన మహేష్ ఆ భ్రమలో నుండి తేరుకొన్నందుకు మహేష్ అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
అంతే కాదు ఖలేజా దెబ్బకు మహేష్ భార్య నమ్రత కూడా తేరుకుని మహేష్ గురించి తగు జాగ్రత్తలు తీసుకొంటోంది. ప్రిన్స్ మహేష్ సిగరెట్ ఎక్కువగా తాగేవాడట..గ్లామర్ తగ్గుతోందని నమ్రతే మహేష్ చేత సిగరెట్ మాన్సించిందని, అలాగే జిమ్ కు కూడా పంపించి మరింత అందంగా మహేష్ ను తయారు చేసింది సమాచారం. తాజాగా నాన్ వెజ్ తినడం కూడా మానేసాడాని దానికి కూడా నమ్రతే కారణం అని అయితే మొత్తం మీద అతని ఆరోగ్యం పట్ల బాగ శ్రద్ద తీసుకుంటున్న నమ్రత మహేష్ చేసే సినిమాల గురించి కూడా కేర్ తీసుకుంటే మంచి సినిమాలు మహేష్ చేసే అవకాశం ఉంటుందని ఖలేజా లాంటి ప్లాప్ల్ రావని సినీజనం అంటున్నారు.


Click it and Unblock the Notifications











