మహేష్, బోయపాటి శ్రీను చిత్రం టైటిల్
ప్రస్తుతం రూలర్ అనే పదం బాగా పాపులర్ అయ్యిన సంగతి తెలిసిందే. దమ్ము సినిమాలోని ఓ పాటలో ఈ పదం వస్తుంది. అలాగే బాలకృష్ణ అధినాయుకుడు పోస్టర్స్ పై కూడా హి రూల్స్ అని వేస్తున్నారు. ఈ నేపధ్యంలో మహేష్ తదుపరి చిత్రానికి రూలర్ టైటిల్ పెట్టే అవకాశముందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దీనికి కారణం బూరుగు పల్లి శివరామకృష్ణ ఈ టైటిల్ ని పిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయటమే.
బూరుగుపల్లి శివరామకృష్ణ తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయనున్నానురు. దాంతో ఆ చిత్రానికి రూలర్ అనే పేరు పెడతారని గుసగుసలు మొదలయ్యాయి. అందులోనూ ఆ చిత్రాన్ని బోయపాటి శ్రీను డైరక్ట్ చేయనున్నారు. బోయపాటి శ్రీను చిత్రం దమ్ములోని పాట పదమే కాబట్టి అలా ఫిక్సయ్యారన్నమాట. ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను ..దమ్ము ట్రైలర్స్ విడుదల చేసి విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేసి వాటిని అందుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. దమ్ము చిత్రం ఏప్రియల్ 27 న విడుదల కానుంది.
ఇక దమ్ము చిత్రంపై బోయపాటి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కే దమ్ము ఉంది. అంతటి మగాడు అతనే. మీసమున్న ప్రతి ఒక్కడూ మగాడు కాదు. దమ్మున్నోడే సిసలైన మొనగాడు. అంటే ఒక్క చేత్తో వంద మందిని కొట్టడం కాదు. ఒక్కరి కోసం వంద దెబ్బలకు ఎదురు నిలవడం. ఆ కుర్రాడూ అంతే! నమ్ముకొన్న వారి కోసం తన దమ్ము చూపించాడు. అదెలాగో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బోయపాటి శ్రీను.త్రిష, కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి అలెగ్జాండర్ వల్లభ నిర్మాత.
ఇక నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ ప్రస్తుతం దరువు చిత్రం చేస్తున్నారు. రవితేజ హీరోగా చేస్తున్న ఈ చిత్రాన్ని శౌర్యం శివ డైరక్ట్ చేస్తున్నారు. 'దరువు'. సౌండ్ ఆఫ్ మాస్ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ చిత్రం మే 4న విడుదల చేయటానికి తేదీని ఖరారు చేసినట్లు నిర్మాత చెప్తున్నారు. దర్శకుడు శివ మాట్లాడుతూ...అతను పక్కా మాస్. మనిషి మాస్క్ వేసుకున్న ట్రాన్స్‌ఫార్మర్‌లాగా పూర్తి ఎనర్జీతో ఉంటాడు. శత్రువులకు అతనంటే బెదురే. అతగాడు దరువేశాడంటే భూగోళం దద్దరిల్లాల్సిందే. ఈ తరహా మనస్తత్వంతోనే రవితేజ పాత్రను తీర్చిదిద్దాం అన్నారు. అలాగే కొంచెం యాక్షన్‌కి, ఇంకొంచెం సున్నితమైన భావోద్వేగాలకూ చోటుంటుంది. ఈ కొలతలతో మరో సినిమా సిద్ధమైపోతోంది. ఈసారి మాత్రం వినోదాల సౌండ్ ఎక్కువే. మాస్‌తో తీన్‌మార్ ఆడించే కథతో వస్తున్నారని చెప్పారు.


Click it and Unblock the Notifications











