Dasara డైరెక్టర్ శ్రీకాంత్ తో మహేశ్ బాబు సినిమా.. ఒక్క ట్వీట్ లీక్ అయిన న్యూస్!
తొలి చిత్రంతోనే దర్శకుడిగా ప్రశంసలు అందుకోవడం అంత మాములు విషయం కాదు. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు అదృష్టం వరించదు. అలాంటిది దర్శకత్వంలో పెద్దగా అనుభవం లేకుండా నేరుగా పాన్ ఇండియా మూవీనే డైరెక్ట్ చేసి హిట్ కొట్టడం అంటే ఊహించినంత సింపుల్ కాదు. కానీ డైరెక్టర్ ఓదేల శ్రీకాంత్ మాత్రం తొలి పాన్ ఇండియా చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా తెరెకెక్కిన దసరా సినిమాకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈ క్రమంలో శ్రీకాంత్ ఓదేలపై స్టార్ హీరోల కన్ను పడింది. అలా అతనితో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ సినిమా చేయనున్నాడు అనే వార్తలు జోరందుకున్నాయి.

వీర్లపల్లి నేపథ్యం..
నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేష్ రెండోసారి జంటగా నటించిన చిత్రం దసరా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరు నిర్మించిన ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదేల దర్శకత్వం వహించారు. తెలంగాణలోని ఓ గ్రామం వీర్లపల్లి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.

దాదాపుగా 2710కిపైగా..
నాని రగ్గడ్ లుక్ లో కనిపించిన దసరా సినిమాలో దీక్షిత్ నటించి ఆకట్టుకున్నాడు. ఇందులో షైన్ టామ్ చాకో, సాయికుమార్, సముద్రఖని, జరీనా వాహెబ్, పూర్ణ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ఏకంగా ఐదు భాషల్లో మార్చి 30న గ్రాండ్ గా విడుదల చేశారు. తెలంగాణలోని సింగరేణి ఏరియా కథతో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2710కి పైగా థియేటర్లలో విడుదల చేశారు.

ఆ ట్వీటే కారణం..
నాని దసరా సినిమాకు విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. బ్లాక్ బస్టర్ టాక్ తో మంచి వసూళ్లు రాబడుతోంది. నాని అభిమానులు, ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం దసరా చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తూ ప్రశంసిస్తున్నారు. ఒక డైరెక్టర్ కు ఒక హిట్టు పడిందంటే తర్వాత సినీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్న విషయం తెలిసిందే. అలా శ్రీకాంత్ ఓదెలకు సూపర్ స్టార్ మహేశ్ బాబును డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందని పలువురు అంటున్నారు. అందుకు ఒక ట్వీట్ కారణమైంది.
మణిశర్మ సంగీతంలా..
దసరా టీమ్ ను ప్రశంసిస్తూ తాజాగా మహేశ్ బాబు ఒక ట్వీట్ చేశారు. దసరా సినిమా స్టన్నింగ్ గా ఉంది. "టీమ్ ను చూస్తేంటే గర్వంగా ఉంది" అని మహేశ్ బాబు రాసుకొచ్చారు. ఈ ట్వీట్ కు నాని స్పందించారు. "థ్యాంక్యూ మహేశ్ సార్. మంచి సినిమాలకు మీ వాయిస్ ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది. పోకిరి సినిమాకు మణిశర్మ సంగీతం ఎలా ఉంటుందో అచ్చం అలాగే" అని తెలిపాడు. ఈ ట్వీట్ ఒక్కసారిగా నెట్టింట్లో వైరల్ గా మారింది.

మహేశ్ బాబు నుంచి కబురు..
అలా ట్వీట్ వైరల్ అవడంతో కొందరు నెటిజన్లు మరోలా స్పందిస్తున్నారు. మహేశ్ బాబు హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకులతో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తారని, అందుకోసమే శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేసేందుకే అలా ట్వీట్ చేశారని అంటున్నారు. దీంతో ఈ వార్త హల్ చల్ చేస్తోంది. అయితే దీంట్లో ఎంత నిజముందో మాత్రం ఎవరికీ తెలియదు. అయితే మహేశ్ ఇప్పటివరకు కొత్త డైరెక్టర్లతో సినిమా చేయలేదని, హిట్ కొట్టిన డైరెక్టర్లకు మంచి కథ ఉంటే చెప్పమని మహేష్ నుంచి కబురు వెళ్తుందని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











