మళ్లీ పవన్ కోసం మహేష్ ఓకే అన్నాడు
హైదరాబాద్ : మహేష్ బాబు మరో సారి పవన్ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి గొంతు సవరించుకుంటున్నారా....అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఓ మైగాడ్ రీమేక్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి మహేష్ వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణ కానుందని సమాచారం. ఈ మేరకు మహేష్ తో మాట్లాడి ఒప్పించారని తెలుస్తోంది.
పవన్ కి,వెంకటేష్ కి మహేష్ మంచి స్నేహితుడు అందుకే ఈ వాయిస్ ఓవర్ ఇవ్వటానికి ఆలోచించకుండా కమిటయ్యాడు అంటున్నారు. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చి పండించనున్నారని చెప్పుకుంటున్నారు. జల్సా చిత్రంతో వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ ..ఆ చిత్రానికి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచారు.
ఇక బాలీవుడ్ సూపర్ హిట్ 'ఓ మై గాడ్' సినిమాకి ఈ చిత్రం రీమేక్. ఈ చిత్రానికి ఏం పేరు పెట్టే అవకాసముందే విషయమై మీడియాలో రకరకాల వార్తలు ప్రచారమవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రానికి 'ఓరి దేముడా'అనే టైటిల్ పెట్టే అవకాసముందని చెప్తున్నారు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయటానికి నిర్ణయించారని ఫిల్మ్ సర్కిల్సో లో వినిపిస్తోంది.
పవన్ కల్యాణ్, వెంకటేష్ కలిసి నటిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అది ఇప్పటికి కుదిరింది. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన చిత్రం 'ఓ మై గాడ్'. 'మేన్ హూ స్యూడ్ గాడ్' అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ రెండు చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకొని.. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇందులో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ చేసిన శ్రీ కృష్ణుని పాత్రలో పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ చేసిన ఓ సాధారణ వ్యాపారి పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు. డాలీ ఈ చిత్రం డైరక్ట్ చేస్తారు.


Click it and Unblock the Notifications












