మరోసారి ఆ దర్శకుడితోనే సిట్టింగ్ వేసిన మహేష్.. ప్రాజెక్ట్ లోకి దిల్ రాజు కూడా..
సూపర్ స్టార్ మహేష్ బాబు స్పీడ్ చూస్తుంటే రాజమౌళి కంటే ముందే మరో సినిమాను పూర్తి చేసేలా ఉన్నాడని అనిపిస్తోంది. ఇప్పటికే సర్కారు వారి పాట యొక్క స్పీడ్ ను గట్టిగానే పెంచాడు. ఒక షెడ్యూల్ పూర్తవ్వడంతో వెంటనే మరో షెడ్యూల్ ను స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. అయితే మహేష్ వచ్చే ఏడాది రాజమౌళి సినిమాను స్టార్ట్ చేయనున్న విషయం తెలిసిందే.
అయితే ఆ లోపే తొందరగా మరో సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల వంటి కమర్షియల్ ఎంటర్టైనర్ దర్శకులతో చర్చలు కూడా జరిపినట్లు టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు మరొక కొత్త రూమర్ కూడా తెరపైకి వచ్చింది. మహర్షి దర్శకుడైన వంశీ పైడిపల్లితో కూడా మరోసారి చర్చలు జరిపినట్లు టాక్ వస్తోంది. మహేష్ ఒప్పుకుంటే దిల్ రాజు ప్రొడక్షన్ లోనే ఆ ప్రాజెక్ట్ తెరపైకి వస్తుందట.

రాజమౌళి RRR పూర్తి చేసిన తరువాత మహేష్ బాబు సినిమా కోసం ఫుల్ స్క్రిప్ట్ తో రెడీ కానున్నాడట. అందుకు నాలుగు నుంచి 5 నెలల సమయం పట్టవచ్చు. అందుకే మహేష్ వీలైనంత త్వరగా సర్కారు వారి పాటను ఫినిష్ చేసి ఒక కమర్షియల్ సినిమాను తొందరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడని టాక్ వస్తోంది. అందుకు సంబంధించిన రూమర్స్ కూడా చాలానే వైరల్ అవుతున్నాయి. ఇక SVP సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











