ఆ చిత్రం కోసం మహేష్ రెమ్యునేషన్ ఎనిమిది కోట్లా?
మహేష్ బాబు తాజాగా త్రీ ఇడియట్స్ రీమేక్ కి కమిటయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం మహేష్ సింగిల్ పేమెంట్ ఐదు కోట్ల తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మూడు కోట్లు బ్యాలన్స్ ఉండటంతో మహేష్ ఈ చిత్రం ఎక్కడా చేస్తున్నట్లు చెప్పటం లేదు. దాంతో రీమేక్ రైట్స్ తీసుకున్న జెమినీ వారికి కంగారుపట్టుకుంది. ఇక ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం చాలా ఖర్చు పెట్టారని, అలాగే శంకర్ ని డైరక్టర్ గా తీసుకోవటానికి పెద్ద ఎమౌంట్ అడ్వాన్స్ గా ఇచ్చారని, ఇక తమిళంలో విజయ్ కీ సైతం ఊహించని మొత్తాన్నే ఆఫర్ చేసారని తెలుస్తోంది. అయితే రోబో ఘన విజయాన్ని పరిగణలోకి తీసుకుని ఖర్చుపెడుతున్న ఈ సంస్ధవారు ఏ రేంజ్ లో మార్కెట్ చేస్తే వర్కవుట్ అవుతుందనేది ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇలియానాని తెలుగు,తమిళ వెర్షన్స్ లకు హీరోయిన్ గా తీసుకున్నారు. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న ప్రొపిసర్ బొమన్ ఇరానీ పాత్రను సత్యరాజ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మహేష్..శ్రీను వైట్ల కాంబినేషన్ లో చేస్తున్న దూకుడు చిత్రం టర్కీ షెడ్యూలు పూర్తి చేసుకు వచ్చారు. ఆ యూనిట్ నెక్ట్స్ షెడ్యూల్ కోసం దుబాయ్ వెళ్తున్నారు.


Click it and Unblock the Notifications











